England vs South Africa | 24 ఓవర్లలో ఆల్ అవుట్ అయిన ఇంగ్లాండ్
సౌతాఫ్రికా ఇంగ్లాండ్ మధ్య వన్డే సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్ లో సౌత్ ఆఫ్రికా బౌలర్లు ఇంగ్లాండ్ బ్యాట్స్మన్ కు చుక్కలు చూపించారు. తమ డేంజరస్ బౌలింగ్ తో ఇంగ్లాండ్ కు చమటలు పట్టించారు. స్ట్రాంగ్ బ్యాటింగ్ టీం గా పేరు తెచ్చుకున్న ఇంగ్లాండ్ అత్యంత తక్కువ స్కోరుకే ఆలౌట్ అయింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది సౌత్ ఆఫ్రికా. మ్యాచ్ స్టార్ట్ అవగానే సౌతాఫ్రికా 13 పరుగులకే ఫస్ట్ వికెట్ ను పడగొట్టింది. బ్యాట్స్మన్ బెన్ డకెట్, జో రూట్ కూడా వెంట వెంటనే అవుట్ అయారు. జేమీ స్మిత్, హ్యారీ బ్రూక్ కలిసి మెల్లగా స్కోరును 82 పరుగులకు చేర్చారు. కానీ, ఆ తర్వాతే అసలు గేమ్ మొదలయింది. 2 వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసిన ఇంగ్లాండ్ బ్యాట్స్మన్, 131 పరుగులకే ఆలౌట్ అయ్యారు. మోతంగా ఇంగ్లాడ్ ఆడింది 24.3 ఓవర్లు మాత్రమే. ఇక బ్యాట్టింగ్ మొదలు పెట్టిన సౌత్ ఆఫ్రికా 20. 5 ఓవర్లలో మ్యాచ్ ముగించింది. బౌలర్ మహారాజ నాలుగు వికెట్లు పడగొట్టాడు.