England vs Australia Ashes 2025 | ఆస్ట్రేలియా ఘన విజయం
యాషెస్ 2025-26 సిరీస్ తొలి టెస్ట్ ఉత్కంఠభరితంగా జరిగింది. ఇంగ్లాండ్ పై 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ట్రావిస్ హెడ్ ఒక్కడే మ్యాచ్ మొత్తని మార్చేశాడు. 123 పరుగులు చేసి చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడాడు. పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో జరిగిన ఈ టెస్ట్ మ్యాచ్ కేవలం 2 రోజుల్లోనే ముగిసింది.
ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 172 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా జట్టును మొదటి ఇన్నింగ్స్‌లో 132 పరుగులకే ఆలౌట్ చేశారు. దాంతో తొలి ఇన్నింగ్సులో ఇంగ్లాండ్‌కు 40 పరుగుల ఆధిక్యాన్ని ఇచ్చారు. ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో ఆధిక్యంతో ఆస్ట్రేలియాకు నాల్గవ ఇన్నింగ్స్‌లో 205 పరుగుల టార్గెట్ ఇచ్చారు. ట్రావిస్ హెడ్ 83 బంతుల్లో 16 ఫోర్లు, 4 సిక్సర్లతో 123 పరుగులు చేసాడు. జాక్ వెడ్రాల్డ్ 23, మార్నస్ లాబుషేన్ 51 పరుగులతో హాఫ్ సెంచరీ సాధించాడు. దాంతో 8 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ పై విజయం సాధించింది అస్ట్రేలియా. తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసిన ఆసీస్ పేసర్ మిచెట్ స్టార్క్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.