Shreyas Iyer Injury IPL 2026 | టీ20 ప్రపంచకప్ కు అయ్యర్ దూరం ?
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో గాయపడ్డ టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఇప్పట్లో తిరిగి మైదానంలో కనిపించే అవకాశాలు కనిపించడం లేదు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇంటర్నల్ బ్లీడింగ్ వల్ల ఐసీయూలో చేర్పించారు. ప్రస్తుతం రీహాబ్‌లో ఉన్న అయ్యర్.. కోలుకునేందుకు మరికొన్ని నెల్లలు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
శ్రేయస్ కోలుకోవడానికి కనీసం 2 నుంచి 4 నెలలు పట్టే అవకాశం ఉందట. ఆలా చూసుకుంటే సోత్ ఆఫ్రికాతో జరిగే వన్డే సిరీస్, న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు శ్రేయస్ దూరం కావడం ఖాయం. అలాగే 2026 ఫిబ్రవరి, మార్చిలో జరిగే టీ20 ప్రపంచకప్ లో కూడా శ్రేయస్ సైతం అయ్యర్ ఆడే అవకాశాలు కనిపించడం లేదు. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభం వరకు కోలుకున్నా కూడా మొదట్లో మ్యాచులు ఆడడం కష్టమే. ఒకవేళ అప్పటికి శ్రేయస్ కోలుకోవడానికి ఇంకా టైం పడితే ... మరికొన్ని నెలలపాటు రెస్ట్ లోనే ఉండాల్సి ఉంటుంది.