Mumbai Indians: ముందుకెళ్లాలంటే గెలవాల్సిందే.. ముంబై ఇండియన్స్‌కు నేడు పెద్ద సవాల్
Continues below advertisement
ఐపీల్- 2021చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే ఢిల్లీ, చెన్నై, బెంగళూరు ప్లే ఆఫ్‌కి చేరుకోగా హైదరాబాద్ టోర్నమెంట్ నుంచి తప్పుకుంది. ఇవాళ ఢిల్లీ, ముంబై మధ్య ఉత్కంఠ భరితంగా మ్యాచ్ జరగబోతోంది. ప్లేఆప్ రేస్‌లో ఉండాలంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై ఎలాంటి పోరాటం చేస్తుందో అన్నది ఇక్కడ ఆసక్తిగా మారింది. ఈ సీజన్‌లో ఢిల్లీ 11 మ్యాచ్‌లు ఆడి 8 మ్యాచ్‌లు గెలవగా రోహిత్ సేన అంత జోరు చూపలేదు. వాళ్లు 11 మ్యాచ్‌లు ఆడి కేవలం 5 మ్యాచ్‌లే గెలవగలిగారు.
Continues below advertisement