Delhi Capitals Bowlers Come Back IPL 2026 | ఢిల్లీ బౌలర్ల స్ట్రాంగ్ కమ్ బ్యాక్

అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు ఢిల్లీపై దండయాత్ర చేసారు. 20 ఓవర్లలో కేవలం 4 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరు సాధించి, ఢిల్లీ క్యాపిటల్స్ ముందు 211 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు. 

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. సాయి సుదర్శన్ క్లీన్ బౌల్డ్ అయి నిరాశపరిచినప్పటికీ, ఆ తర్వాత వచ్చిన జోస్ బట్లర్ విధ్వంసం సృష్టించాడు. బౌండరీల వర్షం కురిపించిన బట్లర్, కేవలం 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బట్లర్ ఔటైన తర్వాత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 70, వాషింగ్టన్ సుందర్ 55 పరుగులతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. 

18వ ఓవర్‌లో గిల్ ఔట్ కావడంతో సీన్ రివర్స్ అయింది. ఇన్నింగ్స్ చివరి 12 బంతుల్లో ఒక్క బౌండరీ కూడా రాకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఢిల్లీ బౌలర్లు డెత్ ఓవర్లలో అద్భుతంగా పుంజుకోవడంతో గుజరాత్ ఆశించిన పరుగులు సాధించలేకపోయింది. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ 2 వికెట్లు తీయగా, కుల్దీప్, ఎంగిడి చెరో వికెట్ పడగొట్టారు. డెత్ ఓవర్స్ లో పరుగులు కాపాడుకున్నప్పటికీ.. మ్యాచ్ ను మాత్రం ఓడిపొయ్యారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola