IPL 2026 DC vs GT Highlights | ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ ఫస్ట్ విక్టరీ

ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ ఎట్ట‌కేల‌కు బోణీ కొట్టింది. రెండు వ‌రుస ప‌రాజ‌యాల త‌ర్వాత విజ‌యం సాధించింది. ఢిల్లీ క్యాపిట‌ల్స్ పై 1 ప‌రుగుతో విజ‌యం సాధించింది. టాస్ ఓడి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్.. బ్యాట‌ర్ల ఆట‌తీరుతో 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల‌కు 210 ప‌రుగులు చేసింది. జ‌ట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన శుభ‌మాన్ గిల్ స్ట‌న్నింగ్ 45 బంతుల్లో 70  పరుగులతో అల‌రించాడు. 

ఇక భారీ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన ఢిల్లీకి ఓపెన‌ర్ రాహుల్, ప‌థుమ్ నిస్సాంక అదిరే ఆరంభాన్ని అందించారు. ఆరంభంలో రాహుల్ ఆచితూచి ఆడ‌గా, నిస్సాంక మాత్రం బౌండ‌రీల‌తో రెచ్చిపోయాడు. వీళ్లిద్ద‌రూ జోరు చూపించ‌డంతో ప‌వ‌ర్ ప్లే ముగిసేస‌రికి 63 ప‌రుగుల‌తో స‌త్తా చాటింది. వీరిద్ద‌రూ తొలి వికెట్ కు 76 ప‌రుగులు జోడించ‌డంతో ఢిల్లీ ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. అయితే ఇంపాక్ట్ ప్లేయ‌ర్ గా వ‌చ్చిన ప్ర‌సిద్ధ్ కృష్ణ‌.. నిస్సాంక‌ను ఔట్ చేశాడు.

కొద్దీ సేపటికే అక్ష‌ర్ ప‌టేల్, ట్రిస్ట‌న్ స్ట‌బ్స్ ఔట్ కావ‌డం, రాహుల్ కూడా పెవిలియ‌న్ కు చేర‌డంతో ఉత్కంఠ నెల‌కొంది. ఈ దశలో మిల్లర్ జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. ఆఖరు బంతికి పోరాడినా ఢిల్లీకి ఓటమి తప్పలేదు. చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సి ఉండగా, డాట్ బాల్ వేసిన ప్రసిధ్ద్ .. జట్టును గెలిపించాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola