CWG 2022 Cricket Final : కామన్వెల్త్ క్రికెట్ ఫైనల్ లో టీమిండియా ఓటమి | ABP Desam
కామన్వెల్త్ గేమ్స్‌ను భారత మహిళల క్రికెట్ జట్టు రజతంతో ముగించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో 9 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.అనంతరం 162 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 19.3 ఓవర్లలో 152 పరుగులకే ఆలౌట్ అయింది.