CSK Bowling Failure vs RCB IPL 2026 | చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించిన ఆర్సీబీ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ విభాగం ఘోరంగా విఫలమైంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు చెన్నై కెప్టెన్ రుతురాజ్. ఆరంభంలో 3 ఓవర్లకు కేవలం 17 పరుగులే ఇచ్చి కట్టడి చేసినట్లు కనిపించినా CSK బౌలర్లు.. ఆ తర్వాత వరుస తప్పిదాలతో మ్యాచ్‌ను చేజార్చుకున్నారు.

ముఖ్యంగా ఫీల్డింగ్ లోపాలు చెన్నైని కోలుకోలేని దెబ్బ తీశాయి. విరాట్ కోహ్లీ 7 పరుగుల వద్ద ఉన్నప్పుడు శివమ్ దూబే క్యాచ్‌ను వదిలేసాడు. ఆ తర్వాత దూబే బౌలింగ్‌లోనే దేవదత్ పడిక్కల్ ఒకే ఓవర్‌లో 14 పరుగులు సాధించాడు. ఇక ఇన్నింగ్స్ చివరలో చెన్నై బౌలర్ల ప్రదర్శన మరీ దారుణంగా తయారైంది. టిమ్ డేవిడ్ ఇచ్చిన క్యాచ్‌ను అన్షుల్ కంబోజ్ పట్టుకున్నప్పటికీ, అది నో బాల్ కావడంతో ఆర్సీబీకి అడ్వాంటేజ్ లభించింది. ఆ ఒక్క తప్పిదం మ్యాచ్ మొత్తాన్ని మార్చేసింది. 

చివరి 5 ఓవర్లలో చెన్నై బౌలర్లు ఏకంగా 97 పరుగులు సమర్పించుకున్నారు. జెమీ ఓవర్టన్ వేసిన ఆఖరి ఓవర్‌లో టిమ్ డేవిడ్ మూడు వరుస సిక్సర్లతో 30 పరుగులు రాబట్టాడు. మొదటి 6 ఓవర్లలో 51 పరుగులే ఇచ్చిన బౌలర్లు, ఆ తర్వాత 14 ఓవర్లలో ఏకంగా 199 పరుగులు సమర్పించుకోవడం చెన్నై బౌలింగ్ వైఫల్యానికి నిదర్శనం.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola