RCB IPL 2025 Retention Players | కింగ్ Virat Kohli పట్టాభిషేకానికి మళ్లీ ముహూర్తం.? | ABP Desam
కింగ్ విరాట్ కొహ్లీ మళ్లీ కెప్టెన్ అవుతున్నాడా. ఐపీఎల్ 2025 కోసం రిటైన్ చేసుకున్న ప్లేయర్ల జాబితాను విడుదల చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు. ఐతే ఆశ్చర్యకరంగా చాలా నిర్ణయాలు తీసుకుంది ఆర్సీబీ. ముందుగా కెప్టెన్ గా ఉన్న ఫాప్ డుప్లెసినీ తప్పించింది. అంతే కాదు తనదైన రోజున విధ్వంసాలు చేసే గ్లెన్ మ్యాక్స్ వెల్ ను తప్పించింది. కేమరూన్ గ్రీన్ లాంటి స్టార్ ఆల్ రౌండర్ ను కూడా వద్దనుకుంది. ఇవన్నీ ఎందుకు చేసిందో తెలియదు కానీ కింగ్ విరాట్ కొహ్లీని రిటైన్ చేసుకుంది. అది కూడా 21కోట్ల రూపాయల భారీ ధర ఇచ్చి. విరాట్ కాకుండా రజత్ పాటిదార్ 11కోట్ల రూపాయలు, యశ్ దయాల్ ను ఐదుకోట్ల రూపాయలకు రిటైన్ చేసుకుంది. దీంతో కేవలం 37కోట్ల రూపాయలు ఖర్చు చేసి ముగ్గురు ప్లేయర్లను పెట్టుకుని మిగిలిన టీమ్ మొత్తం ఆక్షన్ కు వదిలేసింది. 83కోట్ల రూపాయల పర్స్ తో ఆక్షన్ కి వెళ్తోంది ఆర్సీబీ. సో ఎవరెవరిని కొనుక్కుంటుందో చూడాలి. కానీ మళ్లీ ఆర్సీబీని నడిపించే బాధ్యతలను విరాట్ కొహ్లీని తీసుకుంటున్నాడని ఈ రిటెన్షన్ తో అయితే అర్థం అవుతోందని టాకే ఎక్కువగా వినిపిస్తోంది. మహారాజుకే పట్టాభిషేకం మళ్లీ చేస్తారా లేదా 18వసారి దండయాత్రకు సిద్ధం అవుతారా..లేదా ఆక్షన్ లో ఎవరినైనా పెద్ద ప్లేయర్ ని తీసుకుని కెప్టెన్ చేస్తారా చూడాలి.