Sunrisers Hyderabad Retention Full List 2025 | రిటెన్షన్ డబ్బుల్లో Klaasen అన్న మాస్ | ABP Desam
ఈ ఏడాది ఉప్పల్ పిచ్ మీద ఒక్కోడికి చుక్కలు చూపించిన కాటేరమ్మ కొడుకులు మొత్తం ఈసారి కూడా ఉన్నారు. కావ్యాపాప ఒక్కళ్లని కూడా వదల్లేదు. వచ్చే ఏడాది కూడా ఒక్కోడికి జాతర రుచి చూపించటానికి కోర్ టీమ్ ను అలాగే పెట్టుకుంది సన్ రైజర్స్ టీమ్. ఇందుకోసం పర్స్ లో ఉన్న 120 కోట్లలో 75 కోట్లు అలా సింపుల్ గా విసిరిపారేసింది. అందరికంటే హయ్యెస్ట్ గా మాస్ గాడ్ హెన్రిచ్ క్లాసెన్ కోసం 23 కోట్లు పెట్టింది సన్ రైజర్స్ టీమ్. ఇది రిటెన్షన్ ప్లేయర్ల డబ్బులోనే అత్యధికం. ఇప్పుడు వరకూ ఐపీఎల్ చరిత్రలో ఆక్షన్ లో గతేడాది స్టార్క్ కి వచ్చిన 24 కోట్ల 75 లక్షలే అత్యధికం కాగా...ఇప్పుడు రిటెన్షన్ లో క్లాసెన్ కి 23కోట్లు దక్కటం చరిత్ర అనే చెప్పుకోవాలి. ఇంకా కెప్టెన్, సైలెన్సర్ ప్యాట్ కమిన్స్ కోసం 18కోట్లు...యువ రెపటం అభిషేక్ శర్మ కోసం 14కోట్లు, హెడ్ మాస్టర్ హెడ్ కోసం 14కోట్లు, తెలుగోడి పవర్ నితీశ్ రెడ్డి కోసం 6కోట్లు పెట్టింది సన్ రైజర్స్. అంటే ఈ ఐదుగురినే కోర్ టీమ్ గా భావించి వాళ్లకోసమే 75కోట్లు పెట్టి 120 కోట్లలో ఇక మిగిలిన ఎమౌంట్ తోనే ఆక్షన్ కి వెళ్తోంది సన్ రైజర్స్. సో వచ్చే ఏడాది కూడా ఆరెంజ్ ఆర్మీ అభిమానులకు పండుగే అన్నమాట.