MS Dhoni Retained by CSK | రిటెన్షన్ ప్లేయర్ల జాబితా 2025 విడుదల చేసిన చెన్నై సూపర్ కింగ్స్ | ABP Desam
నరసింహా సినిమాలో రజినీకాంత్ ని అబ్బాస్ అంటాడు ఆయనకింకా వయస్సు అయిపోలేదని. అచ్చం అలానే జరిగింది సీఎస్కేతో ఈసారి. ఐపీఎల్ కి చెప్పారు. రూల్స్ మార్చేశారు. అన్ క్యాప్డ్ ప్లేయర్ గా ఆడించుకుంటామన్నారు. వేల కోట్ల ఐపీఎల్ బ్రాండ్ ఒంటిచేత్తో మార్కెట్ చేసి పెడుతున్న వాడికి నాలుగు కోట్లే ఇస్తామన్నారు. ఏవేవో జరిగిపోయాయి. రిజల్ట్ మాత్రం తన 43వ ఏట ధోని ఐపీఎల్ ఆడటానికి సిద్ధమైపోతున్నాడు. ఎల్లో జెర్సీలతో స్టేడియాలు మళ్లీ మోగిపోవాలా. అన్న మళ్లీ వస్తున్నాడని ప్రతీ మాహీ అభిమాని అరిచి మరీ చెప్పుకోవాలా. ఐదుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకుంది చెన్నై. ముందుగా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 18కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంది. తర్వాత క్రికెట్ తలపతి రవీంద్ర జడేజా. జడ్డూకు కూడా 18 కోట్లు ఇచ్చి రిటైన్ చేసుకుంది. ఇక చేతబడి స్టార్ మతీశా పతిరానా 13కోట్లు..ఆరడుగుల అందగాడు శివమ్ దూబే కి 12కోట్ల రూపాయలు ఇచ్చి రిటైన్ చేసుకుంది. ఇక ఐదో ప్లేయర్ గా అన్ క్యాప్డ్ ప్లేయర్ క్యాటగిరీలో బాహుబలి మహేంద్ర సింగ్ ధోనిని జస్ట్ 4కోట్లు ఇచ్చి రిటైన్ చేసుకుంది. రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, దీపక్ చాహర్ లాంటి ఆటగాళ్లను ఆక్షన్ కి విడిచిపెట్టేసేంది చెన్నై. ధోని ఆడతాను అనటమే పెద్ద అడ్వాంటేజ్ చెన్నైకి. మొత్తం ఐదుగురు ప్లేయర్లకు 55 కోట్లు పెట్టింది. ఇక మిగిలిన 65కోట్ల తో ఆక్షన్ కి వెళ్తోంది చెన్నై సూపర్ కింగ్స్