Virat Kohli Emotional Speech About Jasprit Bumrah | బుమ్రా ఈ దేశపు ఆస్తి అంటున్న కోహ్లీ | ABP Desam

Virat Kohli Emotional Speech About Jasprit Bumrah |  జస్మిత్ బుమ్రా... అల్లాటప్ప బౌలర్ కాదు..! వన్స్ ఇన్ ఏ జనరేషన్ బౌలర్ అంటే... జనరేషన్ కి ఒక్కడు పుడతాడు అలాంటి ఆటగాడు. ఈ మాటలు చెబుతోంది నేను కాదు.. కింగ్ కోహ్లీ...! గురువారం వాంఖేడే స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో కోహ్లీ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. వరల్డ్ కప్ మొత్తం...మేము ఓటమి అంచుల్లో ఉన్న ప్రతిసారి మొత్తం మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. మరి ముఖ్యంగా ఫైనల్ లో 30 బాల్స్ లో 30 పరుగులు కొట్టాలి.దక్షిణాఫ్రికా చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. ఈ సమయంలో మ్యాచ్ ను ఇండియా వైపు టర్న్ చేశాడని కోహ్లీ అన్నారు. బుమ్రా ఈ దేశపు ఆస్తి... ప్రపంచపు 8వ వింత అనడంలో ఎలాంటి సందేహం లేదని కోహ్లీ చెప్పుకోచ్చారు. టోర్నమెంట్ లో 15 వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచాడు. మరోవైపు.. విరాట్ , రోహిత్ లు రిటైర్మెంట్ ప్రకటించారు..బుమ్రా రిటైర్మెంట్ ఎప్పుడు అని యాంకర్ అడగ్గా...ఇప్పట్లో కాదు మరికొన్నాళ్లు తన వేట కొనసాగుతుందని బుమ్రా స్పష్టం చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola