Virat Kohli Emotional About Rohit Sharma |15 ఏళ్లలో రోహిత్ శర్మను అలా చూడలేదంటున్న విరాట్ కోహ్లీ

Virat Kohli Emotional About Rohit Sharma | 15 ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్నాం కానీ రోహిత్ శర్మ ఇంత ఎమోషనల్ గా మారడానికి ఎప్పుడు చూడలేదని విరాట్ కోహ్లీ అన్నారు. గురువారం వాంఖేడే స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన కోహ్లీ..ఫైనల్ రోజు జరిగిన ఎమోషనల్ మూమెంట్స్ ను గుర్తుకు తెచ్చుకున్నారు. ఫైనల్ లో గెలిచాక పెవిలియన్ బాట పడుతుండగా రోహిత్ తో పాటు తనకు కన్నీళ్లు ఆగలేదని కోహ్లీ అన్నారు. అప్పుడు రోహిత్ శర్మను హత్తుకున్న ఆ క్షణం జీవితంలో మరిచిపోలేనని అన్నారు. 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచినప్పుడు సచిన్ ఎందుకంతా ఎమోషనల్ అయ్యారో అప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు నాకు అర్థమవుతందన్నారు.  రోహిత్, నేను మా భూజాలపై ఇన్నాళ్లు మోశాం. ఇక.. తరువాత తరానికి ఈ బాధ్యతలు అప్పగించాల్సిన సమయం వచ్చింది. అందుకే...వరల్డ్ కప్ గెలిచిన వెంటనే ఇద్దరం ఒకేలా ఆలోచించి రిటైర్మెంట్ ప్రకటించామని కోహ్లీ చెప్పారు. ప్రస్తుతం కోహ్లీ స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola