Vaibhav Suryavanshi 10th Board Exams | బీసీసీఐకి క్యూట్ రిక్వెస్ట్ పెట్టుకున్న వైభవ్ సూర్యవంశీ | ABP Desam

 అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్లో 175పరుగులతో తనకంటే నాలుగైదేళ్లు పెద్దోళ్లైన బౌలర్లను పరిగెత్తించి పరిగెత్తించి కొట్టిన సూర్యవంశీ ఇంగ్లండ్ పై భారత్ కు ఘన విజయం అందించటంతో పాటు విశ్వవిజేతగానూ నిలిపాడు. ఇప్పుడు ఐపీఎల్ కోసం రెడీ అవుతున్న వైభవ్ సూర్యవంశీ కి అంత కంటే పెద్ద పరీక్ష వచ్చి పడింది. అదే పదో తరగతి పరీక్షలు. ఈ మార్చి కి 15 సంవత్సరంలోకి అడుగుపెట్టనున్న వైభవ్...ఫిబ్రవరి 17నుంచి పది రోజుల పాటు పదోతరగతి పరీక్షలకు హాజరు అవనున్నాడు. బిహార్ సమస్తిపూర్ లోని పోడార్ ఇంటర్ నేషనల్ స్కూల్ లో పదో తరగతి చదువుతున్న వైభవ్ సూర్యవంశీ..ఆ పరీక్షకలకు హాజరు కావాలని పదిరోజులు తనకు పర్మిషన్ ఇప్పించాలని కోరుతూ బీసీసీఐకు లెటర్ పెట్టాడు. దానికి బీసీసీఐ ఆమోదం తెలుపుతూ ఆల్ ది బెస్ట్ చెప్పింది. ఈ విషయాన్ని పోడార్ ఇంటర్ నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ నీల్ కిశోర్ మీడియాకు వెల్లడించారు. తమ స్కూల్ కే గర్వకారణమైన వైభవ్ సూర్యవంశీ పరీక్షల కోసం భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పిన స్కూల్...మిగిలిన పిల్లలకు ఇబ్బంది కాకుండా..అదే సమయంలో వైభవ్ ఏకాగ్రత కూడా దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపాడు. పదిహేనో ఏట అడుగుపెట్టడంతో ఈ ఏడాది నుంచి వైభవ్ రంజీల్లో కూడా అవకాశం ఉంది. ఐపీఎల్ లో ఈ ఏడాది కూడా అదిరిపోయే పర్ ఫార్మెన్స్ ఇస్తే ఈ టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా టీ20 జట్టు తలుపు తట్టినా ఆశ్చర్యం లేదు. అదే జరిగితే 16ఏళ్లకే ఇంటర్నేషనల్ క్రికెట్లోకి అడుగుపెట్టిన అతి పిన్న వయస్కుడైన భారత క్రికెటర్ రికార్డును వైభవ్ సూర్యవంశీ 15ఏళ్లకే బ్రేక్ చేయటం పక్కాగా కనిపిస్తోంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola