Ashwin Solution For Usman Tariq | పాకిస్తానీ స్పిన్నర్ పిచ్చి బౌలింగ్ పై అశ్విన్ ఫైర్ | ABP Desam

  ఈ వరల్డ్ కప్ లో అన్నింటికంటే ఎక్కువ చర్చకు దారితీస్తున్న విషయం పాకిస్తానీ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్ బౌలింగ్. క్రీజ్ వరకూ నార్మల్ గా వచ్చి బౌల్ డెలివరీ చేసే సమయంలో ఆగి విసురుతున్నట్లుగా ఉన్న తారిఖ్ బౌలింగ్ యాక్షన్ పై పెద్ద చర్చ నడుస్తోంది. తారిఖ్ చకింగ్ చేస్తున్నాడంటూ ప్రత్యర్థి జట్లు ఆరోపిస్తున్నా ఐసీసీ అధికారులు మాత్రం అతని బౌలింగ్ ప్రస్తుతానికి నిబంధనలకు అనుగుణంగానే ఉన్నట్లు చెబుతోంది. అయితే అలా ఆగి బ్యాటర్ కదలికలకు అనుగుణంగా బౌలింగ్ చేస్తుండంటంతో అది పాకిస్తాన్ కు అడ్వాంటేజ్ అవుతోంది. అయితే ఈ వంకర టింకర్ బౌలింగ్ కు చెస్ ప్లేయర్ కమ్ క్రికెటర్ అయిన రవిచంద్రన్ అశ్విన్ ఓ సొల్యూషన్ తో వచ్చాడు. బౌలర్ బౌలింగ్ వేస్తూ ఆగినప్పుడు బ్యాటర్ ఆడకుండా పక్కకు తప్పే హక్కు ఉందన్నాడు అశ్విన్. అంటే ఆ బౌలర్ ఆగాడు..పైగా తను ఎప్పుడు బాల్ ను రిలీజ్ చేస్తాడో తెలియదు కాబట్టి నేను పక్కకు తప్పుకున్నాను అని చెప్పొచ్చట. ఇది ఐసీసీ నిబంధనల్లో ఉందని చెప్పాడు అశ్విన్. సో ఇప్పుడు ఎన్ని సార్లు తారీఖ్ అలా ఆగి బౌలింగ్ చేస్తే బ్యాటర్లు పక్కకు తప్పుకోవచ్చని...అప్పుడు మ్యాచ్ జరగటానికి అది ఆటంకం అవుతుంది కాబట్టి అంపైర్ కలుగచేసుకుని బౌలర్ ను ఆగకుండా బౌలింగ్ చేసేలా యాక్షన్ మార్చుకోవాలని సూచిస్తాడని..యాక్షన్ మార్చుకుంటే తారీఖ్ సున్నా అవుతాడు కాబట్టి అతని పన్నాగం పారదని అశ్విన్ తన యూట్యూబ్ వీడియోలో మాట్లాడాడు. అయితే టీమిండియా పాకిస్తాన్ మ్యాచ్ లో ఆ పని ఎవరు చేస్తారనే చర్చ ఇప్పుడు మొదలైంది. అశ్విన్ తను టీమ్ లో ఉంటే తను కచ్చితంగా చేసే వాడిని ఐసీసీ రూల్స్ లో అది ఉన్నప్పుడు నిబంధనలకు అనుగుణంగా తను ఏదైనా చేస్తానని చెప్పాడు. మరి చూడాలి శివరాత్రికి జరిగే మ్యాచ్ లో తారీఖ్ ను అలా ఆగి మన బ్యాటర్ ఎవరైనా ఏడిపిస్తాడేమో.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola