Team India worst performance | 200 టార్గెట్ అంటే హడలెత్తిపోతున్న టీమిండియా | ABP Desam
200 టార్గెట్.. ఈ రోజుల్లో ఓ టీ20 మ్యాచ్‌లో ఈ మార్క్ దాటకపోతే గెలవడం దాదాపు కష్టమే. 200 ఛేజ్ చేయడం కష్టమే అయినా చాలా టీమ్స్ ఈ మధ్య ఈ భారీ టార్గెట్‌ని ఛేజ్ చేసేస్తున్నాయి. కానీ.. టీమిండియా మాత్రం ఎందుకో ఈ నెంబర్ కనిపిస్తే చాలు చేతులెత్తేస్తోంది. రీసెంట్‌గా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20నే దీనికి పెద్ద ప్రూఫ్. ఈ మ్యాచ్‌లో 214 పరుగుల టార్గెట్ ఛేజింగ్‌లో టీమిండియా.. 162 పరుగులకే ఆలౌట్ అయి.. 51 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో 210+ టార్గెట్‌ని ఇంతవరకు భారత్ ఒక్కసారి ఛేదించలేదంటే సిట్యుయేషన్ అర్థం చేసుకోండి. ఇప్పటివరకు మొత్తంగా 7సార్లు 210 పరుగులకు పైగా లక్ష్యాలను ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. అన్ని మ్యాచ్‌లలో ఓటమినే మూటగట్టుకుంది. ఇది భారత బ్యాటింగ్ ఫెయిల్యూర్‌ని కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. దీనిపై ఇప్పటికైనా బీసీసీఐ, టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్, సెలక్షన్ కమిషన్ ఫోకస్ పెట్టాలని, వరుసగా ఫెయిల్ అవుతున్న సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్ లాంటి బ్యాటర్ల స్థానంలో ఇంకెవరైనా ట్యాలెంటెడ్ బ్యాటర్లని తీసుకోవాలని ఫ్యాన్స్ అంటున్నారు. మరి దీనిపై ీ కామెంట్ ఏంటి?