Sharukh Khan Meets Messi | తన కొడుకును మెస్సీతో ఫోటో తీయించిన షారూఖ్ ఖాన్ | ABP Desam
సెలబ్రెటీలు ఉంటారు..సెలబ్రెటీలకే సెలబ్రెటీలు ఉంటారు. ఈరోజు అలాంటి పరిస్థితి ఒకటి కనిపించింది. మన దేశంతో సహా గల్ఫ్ కంట్రీస్, చాలా ఆసియా దేశాల్లో, అలాగే వెస్ట్రన్ కంట్రీస్ కనీసం 20-30 దేశాల్లో బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ అంటే ఎవరో తెలుసు. కానీ అలాంటి టాప్ సెలబ్రెటీ కూడా మరో సెలబ్రెటీతో ఫోటో కోసం వెయిట్ చేయాల్సి వస్తే..ఇవాళ అదే జరిగింది. కోల్ కతా లో పర్యటిస్తున్న ఫుట్ బాల్ దిగ్గజం లియొనెల్ మెస్సీతో ఫోటో కోసం షారూఖ్ ఖాన్ దాదాపు 15నిమిషాలు ఓ మూలన తన ఫ్యామిలీతో కలిసి నిలబడ్డాడు. గోట్ టూర్ లో భాగంగా ఇండియాలో పర్యటిస్తున్న మెస్సీ ముందుగా కోల్ కతా లోని సాల్ట్ లేక్ స్టేడియం నుంచి తన 70 అడుగుల విగ్రహాన్ని వర్చువల్ గా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తన కొడుకు అబ్రహాంను మెస్సీతో ఫోటో తీయించేందుకు షారూఖ్ ఖాన్ ఇలా ఓ మూలన వేచి చూడటం అందరినీ ఆశ్చర్యపరించింది. అర్జెంటీనా క్రీడాకారుడైన మెస్సీకి షారూఖ్ తెలిసే అవకాశం లేదు. దీంతో తనే స్వయంగా మెస్సీని పరిచయం చేసుకుని తన కొడుకుతో ఓ ఫోటో అడిగాడు. ఎక్కడ తను నిలబడితే ఫోటో గ్రాఫర్లు తనను మెస్సీనే కలిపి తీస్తారో అనుకుని తను సైడ్ కి వంగిపోయి తన కుమారుడు మెస్సీ కలిసి ఫోటోలో పడేలా తపనపడ్డారు షారూఖ్ ఖాన్.