Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
కోల్ కతా లోని సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అర్జెంటీనా ఫుట్ బాల్ దిగ్గజం లియొనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా నిర్వాహకుల వైఫల్యంపై అభిమానులు మండిపడ్డారు. మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్ ఆడతాడని టిక్కెట్లు అమ్మేసి ఇప్పుడు మెస్సీని తీసుకొచ్చి పదినిమిషాల్లోనే తిప్పి తీసుకువెళ్లిపోయారని ఆగ్రహం వ్యక్తం చేసిన అభిమానులు హింసాత్మక ఘటనలకు దిగారు. స్టేడియంలోని కుర్చీలను విరగొట్టి గ్రౌండ్ లోకి విసిరేశారు. బ్యానర్లు, ఫ్లెక్సీలు చింపేశారు. వందలాది మంది అభిమానులు గ్రౌండ్ లోకి బారికేడ్లు దాటి దూసుకెచ్చి పెద్ద పెద్ద టెంట్లను కూలదోశారు. నిర్వాహకుల తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగిన అభిమానులను కట్టడి చేసేందుకు పోలీసులు విఫలయత్నం చేస్తున్నారు. మెస్సీ మ్యాచ్ ఆడకపోవటం...కేవలం పదినిమిషాలు మాత్రమే గ్రౌండ్ లో ఉండటం...అది కూడా కనీసం అభిమానులకు మెస్సీ కనపడకుండా చుట్టూ వీఐపీలు, సెలబ్రెటీలు, ఫిలిం స్టార్లు చుట్టేయటం తో సామాన్య అభిమానులకు కడుపు రగిలిపోయింది హింసాత్మక ఘటనలకు దిగారు.