Gautam Gambhir Strategy SL vs Ind T20 Series | కోచ్ గా ఫస్ట్ సిరీస్లో ఊహకు అందని స్ట్రాటజీలతో గంభీర్
శ్రీలంకతో ఫస్ట్ టీ20 మ్యాచ్. రియాన్ పరాగ్ తో బౌలింగ్. శ్రీలంక ఊహించి ఉండదు. ఎవడీడు అనుకునే లోపే మూడు వికెట్లు పడిపోయాయి. రెండు మూడు టీ20 మ్యాచుల్లోనూ బౌలింగ్ చేశాడు. అంటే పార్ట్ టైమ్ స్పిన్నర్ గా పరాగ్ సేవలు వాడుకోవాలని ఫిక్స్ అయ్యింది భారత్. మూడో టీ20 మ్యాచ్. ఆఖరి రెండు ఓవర్లలో 9పరుగులు చేయాలంటే ఫాస్ట్ బౌలర్లు కాదని రింకూ, సూర్య కుమార్ యాదవ్ బౌలింగ్ చేశారు. పిచ్ స్పిన్ కు సహకరించేదే కావచ్చు కానీ ఊహించని రీతిలో ఈ ఇద్దరి నుంచి బౌలింగ్ కంప్లీట్ స్ట్రాటజీ. వాటర్ బాయ్ వచ్చి సూర్య తో మాట్లాడాటం..ప్లాన్ మారిపోవటం క్షణాల్లో జరిగిపోయింది. ఇది కేవలం సూర్య ఒక్కడి నిర్ణయమే కాదు. ఎలాంటి సందర్భాల్లో ప్రత్యర్థుల ఊహకు అందకుండా ఎలా ప్రవర్తించాలో కంప్లీట్ స్ట్రాటజీ. దీని వెనుక ఉన్న రీజన్ కోచ్ గౌతం గంభీర్. అగ్రెసివ్ బ్యాటర్ గా...ప్రత్యర్థులకు తల వంచని ఫైటర్ గా మాత్రమే అభిమానులకు తెలిసిన గంభీర్ లోని కోచ్ అతని స్ట్రాటజీలు మొట్ట మొదటి సిరీస్ లోనే ఇలా బయట పడ్డాయి. స్టైలిష్ బ్యాటర్లను స్పిన్ మాంత్రికులుగా మార్చి ప్రత్యర్థులను ఊహించలేని దెబ్బకొట్టాడు గౌతీ.ఇది కేవలం ఇప్పుడే ఐపీఎల్ లోనూ ఇలాంటివి మనం చూశాం. కోల్ కతా నైట్ రైడర్స్ కు ఆడే వరకూ కేవలం స్పిన్నర్ గా మాత్రమే తెలిసిన సునీల్ నరైన్ ను పించ్ హిట్టర్ గా మార్చి ఓపెనర్ గా చేసి అద్భుతమైన ఫలితాలు రాబట్టి కోల్ కతాను ఛాంపియన్ గా నిలబెట్టాడు గౌతం గంభీర్. అచ్చం అలాంటి నిర్ణయమే కోచ్ గా తను వ్యవహరించిన మొట్ట మొదటి టీ20 సిరీస్ లోనూ అమలు చేసి అద్భుతమైన ఫలితాలు రాబట్టాడు గౌతం గంభీర్. టీ20ల్లో బ్యాటింగ్ ఎంత ఇంపార్టెంటో అవసరమైన సమయాల్లో ఉపయక్తంగా మారి మ్యాచ్ ను కాచుకోవాల్సిన బౌలర్లు అంతే ఇంపార్టెంట్. అందుకే టీమ్ లో ఉన్న ప్రతీ ఒక్కరికీ అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ లో అవసరమైనప్పుడు వాడుకునేలా వాళ్లకున్న ప్రతిభను కంప్లీట్ గా యూజ్ చేసుకునేలా శ్రీలంకతో టీ20 సిరీస్ లో ప్రయోగాలు జరిగాయి. ఫలితంగా టీమిండియాకు ఇప్పుడు ముగ్గురు ఉపయుక్తమైన పార్ట్ టైమ్ స్పిన్నర్లు పుట్టుకొచ్చారు. అందుకే ఫ్యాన్స్ రింకూ, పరాగ్, సూర్య ల బౌలింగ్ ను ఆర్ట్ అని...గంభీర్ ను ది ఆర్టిస్ట్ అంటూ మీమ్స్ వేస్తున్నారు.