Srilanka vs India 3rd T20 Highlights | నామమాత్రపు మ్యాచ్ ను లంకకు దక్కనివ్వని యంగ్ ఇండియా | ABP

Continues below advertisement

   ఏం జరిగిందో ఏంటో తెలియదు. ఒక ఐదు ఓవర్లలో మ్యాచు మొత్తం మారిపోయింది. మ్యాచ్ తో సిరీస్ కూడా భారత్ వశమైపోయింది. శ్రీలంకకు వైట్ వాష్ తప్పలేదు. శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో జరిగిన విశేషాలివి. ముందు బౌలింగ్ చేసిన శ్రీలంక టీమిండియా టాప్ ఆర్డర్ ను బెంబేలెత్తించింది. శ్రీలంక స్పిన్నర్ల ధాటికి భారత్ 48పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. 39పరుగులు గిల్ టాప్ స్కోరర్ గా నిలవటం మినహా మిగిలిన టాపార్డర్ బ్యాటర్లంతా ఇలా వచ్చి అలా వెళ్లారు. జైశ్వాల్, శాంసన్, రింకూ, సూర్య, శివమ్ దూబే చేతులెత్తేసినా..లోయర్ మిడిల్ ఆర్డర్ లో రియాన్ పరాగ్ అండ్ వాషింగ్టన్ సుందర్ భారత్ ను ఆదుకునే ప్రయత్నం చేశారు. ముందు గిల్ తో పరాగ్ వికెట్ల పతనం ఆపితే తర్వాత సుందర్ పోరాడటంతో భారత్ నిర్ణీత 20ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 137పరుగులు చేసింది. శ్రీలంక తమ స్పిన్నర్లను ఎంత నమ్ముకుందంటే తమ కీ బౌలర్ మతీషా పతిరానాను బౌలింగ్ కి కూడా దింపలేదు. తర్వాత 138 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన లంకను టాప్ 3 ఆటగాళ్లు ఓ రేంజ్ లో నిలబెట్టారు. 15ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక స్కోరు వికెట్ నష్టానికి 108పరుగులు..అంటే మిగిలిన 30 బంతుల్లో 30 పరుగులు చేస్తే చాలు..చేతిలో 9 వికెట్లు ఉన్నాయి. చాలా ఈజీ టార్గెట్ శ్రీలంకకు. అందరూ ఏం ఉందిలే లంకే గెలుస్తుంది అనుకున్నారు. కానీ సుందర్, బిష్ణోయ్ లు మ్యాజిక్ చేశారు. చకా చకా వికెట్లు తీశారు.ఓ పక్క వికెట్లు పడుతున్నా శ్రీలంక లక్ష్యం దిశగానే సాగింది. ఇక మిగిలింది ఆఖరి రెండు ఓవర్లు. 12బంతుల్లో 9పరుగులు చేస్తే చాలు శ్రీలంక విన్. ఈసారి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మ్యాజిక్ చేశాడు. బంతిని తీసుకెళ్లి రింకూ సింగ్ చేతిలో పెట్టాడు. అత్యంత అరుదుగా బౌలింగ్ చేసే రింకూ సింగ్ ను తక్కువ అంచనా వేసింది శ్రీలంక. రింకూ అద్భుతంగా బౌలింగ్ చేసి 3పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. ఇక చివరి ఓవర్ ఆరు పరుగులు కొట్టాలి శ్రీలంక. ఈ సారి బంతిని కెప్టెన్ సూర్య కుమార్ యాదవే పుచ్చుకున్నాడు. మళ్లీ అదే మ్యాజిక్ ఐదు పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీయటమే కాదు మ్యాచ్ ను సూపర్ ఓవర్ కు తీసుకెళ్లాడు సూర్యకుమార్ యాదవ్. సూపర్ ఓవర్ లో వాష్టింగ్టన్ సుందర్ మరో సారి మ్యాజిక్ చేసి రెండు పరుగులే ఇచ్చి శ్రీలంకను ఆలౌట్ చేశాడు. 3పరుగుల టార్గెట్ ను కెప్టెన్ సూర్య ఫోర్ కొట్టి భారత్ కు ఊహించని రీతిలో విజయాన్ని అందించాడు. కళ్ల ముందే భారత్ మ్యాచ్ ను లాగేసుకుంటుంటే ఏం చేయలేక వైట్ వాష్ అయ్యింది శ్రీలంక జట్టు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram