Rinku Surya Parag Spin | అందరూ బ్యాటర్లు అనే అనుకున్నారు..కానీ ఇలా రెచ్చిపోయారు.! | ABP Desam

Continues below advertisement

 శ్రీలంక వర్సెస్ ఇండియా ఫస్ట్ టీ20 చూశాం. టీమిండియా 213పరుగులు చేసింది. కానీ శ్రీలంక ధీటుగా బదులిచ్చింది. కానీ ఒక్కడొచ్చాడు చివర్లో టపాటపా వికెట్లు తీసి శ్రీలంక ను 170పరుగులకే పరిమితం చేయటంలో కీలకపాత్ర పోషించాడు. 8బంతులు మాత్రమే బౌలింగ్ చేసి ఐదుపరుగులు మాత్రమే ఇచ్చి 3వికెట్లు తీశాడు. బ్యాటర్ గా టీమ్ లోకి వచ్చిన రియాన్ పరాగ్ ను స్పిన్నర్ గా బరిలోకి దింపి ఫలితం సాధించిన టీమిండియా మేనేజ్మెంట్ తర్వాత రెండు, మూడు టీ20ల్లోనూ ఫుల్ కోటా బౌలింగ్ చేయించింది పరాగ్ తో. తర్వాత రెండు మ్యాచుల్లోనూ వికెట్లు తీయకపోయినా 30, 27పరుగులు మాత్రమే ఇచ్చి టీ20ల్లో మంచి ఎకానమీతో బౌలింగ్ చేశాడు రియాన్ పరాగ్. అలా అనుకోకుండా ఈ శ్రీలంక సిరీస్ తో పరాగ్ అనే స్పిన్నర్ పుట్టుకొచ్చాడు. నిన్న మూడో టీ20లో మరో ఇద్దరు స్పిన్నర్లు పుట్టుకొచ్చారు. రింకూ సింగ్ అండ్ సూర్యకుమార్ యాదవ్. అసలు ఎప్పుడో దేశవాళీ మ్యాచుల్లో బౌలింగ్ చేసి ఉంటారు. బ్యాటర్లుగా తప్ప బౌలర్లుగా ఇంటర్నేషనల్ క్రికెట్ కి తెలియని తెలియని సూర్య, రింకూ నిన్న శ్రీలంక మీద మ్యాచ్ ను గెలిపించారు. అది కూడా డెత్ బౌలర్లుగా. 19ఓవర్ బౌలింగ్ చేసి రింకూ మూడు పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీస్తే..ఏకంగా 20ఓవర్ కాన్ఫిడెంట్ గా బౌలింగ్ చేసి 6పరుగులు కొట్టకుండా లంకను ఆపటమే కాదు రెండు వికెట్లు తీసి మ్యాచ్ ను సూపర్ ఓవర్ కు పట్టుకెళ్లాడు కెప్టెన్ సూర్య. అలా ఈ లంకతో టీ20 సిరీస్ లో ముగ్గురు ఉపయుక్తమైన పార్ట్ టైమ్ స్పిన్నర్లు పుట్టుకొచ్చారు టీమిండియాకు. అందుకే రియాన్ పరాగ్, సూర్య, రింకూ ముగ్గురు స్టైలిష్ బ్యాటర్లా లేదా స్పిన్ మాంత్రికులా అంటూ నిన్న మ్యాచ్ చూసిన తర్వాత ఇలా మురళీధరన్, షేన్ వార్న్, కుంబ్లేలలతో పోలుస్తూ మీమ్స్ వేస్తున్నారు ఫ్యాన్స్

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram