T20 Worldcup 2024 Group B Preview | టీ20 వరల్డ్ కప్ లో గ్రూప్ B లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు | ABP
Download ABP Live App and Watch All Latest Videos
View In Appటీ20 వరల్డ్ కప్ లో గ్రూప్ B కొంచెం టఫ్ గా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ గ్రూపులో టీ20 వరల్డ్ కప్పును గెల్చుకున్న లాస్ట్ 2 టీమ్స్ ఉన్నాయి. 2021లో టీ20 వరల్డ్ కప్ గెల్చుకున్న ఆస్ట్రేలియా 2022లో టీ20 వరల్డ్ కప్ గెల్చుకున్న ఇంగ్లండ్ ఈ రెండు జట్లు గ్రూపు B లోనే తలపడుతున్నాయి. ఈ గ్రూపులో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా కాకుండా మూడు చిన్న జట్లు కూడా ఉన్నాయి. అవి నమీబియా, ఒమన్, స్కాట్లాండ్. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతోంది ఇంగ్లండ్. 2022లో ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ ను ఫైనల్లో ఓడించి వరల్డ్ కప్ అందుకుంది ఇంగ్లండ్. సో ఆ కాన్ఫిడెన్స్ ఈ సారి కూడా కనిపించటం ఖాయం. ప్రధానంగా కెప్టెన్ జోస్ బట్లరే వీళ్ల బలం. జానీ బెయిర్ స్టో, విల్ జాక్స్, ఫిల్ సాల్ట్, శామ్ కర్రన్, లియామ్ లివింగ్ స్టన్ వీళ్లంతా ఐపీఎల్లో తమ ఫామ్ ను చూపించిన వాళ్లే. హ్యారీ బ్రూక్ ఎలా ఆడతాడో చూడాలి. బౌలింగ్ లో జోఫ్రా ఆర్చర్, క్రిస్ జోర్డాన్ ను నమ్ముకుంది ఇంగ్లండ్. స్పిన్ బాధ్యతలను మోయిన్ అలీ, ఆదిల్ రషీద్ చూసుకుంటారు. వీళ్లకు జూన్ 8న ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచే లీగ్ దశలో పెద్ద మ్యాచ్.