Surya Kumar Yadav on Rohit Sharma Fitness | నాలుగేళ్లలో నాలుసార్లు ఐసీసీ ఈవెంట్స్ ఫైనల్ కి తీసుకువెళ్లాడు | ABP Desam

క్రికెట్ ఆడేంత ఫిట్ నెస్ లేదంటూ రాజకీయాల్లోకి రోహిత్ శర్మను లాగుతుండటంపై టీమిండియా టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ స్పందించాడు. తను 15-20ఏళ్లు క్రికెట్ ఆడుతున్నాడని..నాలుగేళ్లలో నాలుగు ఐసీసీ ఈవెంట్స్ ఫైనల్స్ కు తీసుకువెళ్లిన కెప్టెన్ అంటూ హిట్ మ్యాన్ పై ప్రశంసలు కురిపించాడు సూర్యా భాయ్.  "ఇండియా వైపే ఆలోచిస్తున్నాను. ఛాంపియన్స్ ట్రోఫీలో మనోళ్లు ఫైనల్ ఆడుతున్నారు. ముందు నుంచి మంచిగా ఆడుకుంటూ వచ్చారు. ఫైనల్ మ్యాచ్ కూడా మరో మ్యాచ్ లాంటి అంతే. అలానే ఆడుకుంటే సరిపోతుంది. నేను అందరూ బాగా ఆడాలని కోరుకుంటున్నాను. ఒకటో నంబర్ నుంచి 15వ నెంబరు వరకూ అందరూ బాగా ఆడాలి. బయట సపోర్టింగ్ స్టాఫ్ కూడా మంచిగా మద్దతు ఇస్తున్నారు. మీరు ఒక్కటి ఆలోచించంచడి గడచిన నాలుగేళ్ల కాలంలో నాలుగు సార్లు ఐసీసీ టోర్నమెంటుల్లో రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరించి ఇండియాను ఫైనల్ కు తీసుకువెళ్లాడు. ఇది చాలా గొప్ప విషయం ఏ ఆటగాడికైనా. పైగా అతను 15-20 సంవత్సరాల నుంచి క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు. నేను అతన్ని దగ్గరుండి గమనిస్తూ ఉంటా. అతను ఎంత కష్టపడతాడో ఆఖరకు ఫ్రాంచైజ్ క్రికెట్ ఆడేప్పుడు కూడా అతని కష్టం మాములుది కాదు. నా దృష్టిలో ఎప్పుడూ ఉన్నతంగానే ఉంటాడు. అతనేంటో నాకు తెలుసు. నా వైపు నుంచి ఫైనల్లో బాగా ఆడమని ఆల్ ది బెస్ట్ మాత్రమే చెబుతాను." అని సూర్యకుమార్ యాదవ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola