Siraj Throw ball to Marnus Labuschagne | లబుషేన్ పై బాల్ గిరాటేసిన సిరాజ్ | ABP Desam
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ యాషెస్ సిరీస్ కంటే హీటెడ్ గా తయారైంది. బాల్స్ విసేరిసి మరీ కొట్టుకుంటున్నారు. మొదటి టెస్టు మనం గెలిచామనే కసి మీదున్న ఆసీస్ రెండో టెస్టులో రెచ్చిపోయింది. అడిలైడ్ లో మొదలైన డే అండ్ నైట్ పింక్ బాల్ టెస్టులో ఆస్ట్రేలియా బౌలర్లు కంప్లీట్ డామినెన్స్ చూపించారు. ఇండియా 180కి ఆలౌట్ అయిపోయింది. సరే మనం కూడా వాళ్ల సంగతేంటో తేలుద్దాం అనుకుంటే ఖవాజా అయితే చిక్కాడు కానీ లబుషేన్, మెక్ స్వీనే జిడ్డులా తయారయ్యారు. ఆట ముగిసేవరకూ ఆ ఇద్దరే ఆడారు. ఈ ఫ్రస్టేషన్ మన బౌలర్లలో కనిపించింది. ప్రత్యేకించి ఫామ్ కంటే టెంపర్ చూపించటానికే ఎక్కువ ఇష్టపడే మన డీఎస్పీ సిరాజ్ మియా ఏకంగా బౌల్ విసిరి లబుషేన్ మీద తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఏం జరిగిందంటే సిరాజ్ బౌలింగ్ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ రనప్ కంప్లీట్ చేసేస్తుండగా...వెనుకాల సైట్ స్క్రీన్ దగ్గర్నుంచి ఓ వ్యక్తి బీర్ స్నేక్ తో వెళ్లాడు. అంటే బీరు గ్లాసులు తాగేసి ఉంచుతారు ఆ గ్లాస్ లన్నీ ఒకదాంట్లో ఒకటేస్తే వచ్చే పెద్ద గ్లాసుల సెట్ అన్నమాట. దాన్ని మోసుకుంటూ సైట్ స్క్రీన్ వెనకాల్నుంచి ఆ వ్యక్తి వెళ్లేప్పటికి మార్నస్ లబుషేన్ డిస్ట్రబ్ అయ్యి సిరాజ్ ఆగమన్నాడు. అంతే అప్పటికే బంతిని విసిరేద్దామనుకున్న సిరాజ్ ఫ్రస్టేషన్ వచ్చి ఆగి బూతులు తిడుతూ వికెట్లే కేసి బాల్ విసిరేశాడు. అయితే మార్నస్ బ్యాట్ పెట్టి దాన్ని అడ్డుకున్నాడు కానీ మన బౌలర్లు ఫస్ట్ డే ఎంత ఫ్రస్టేషన్ కి వెళ్లారో ఇదో ఉదాహరణ