Shikhar Dhawan Boycott WCL 2025 Pak Match | పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడమని తేల్చిచెప్పిన భారత ఆటగాళ్లు | ABP Desam

 వరల్డ్ ఛాంపియన్ షిఫ్ ఆఫ్ లెజెండ్స్ అని ఇంగ్లండ్ లో సీనియర్ క్రికెటర్ల టోర్నమెంట్ ఒకటి జరుగుతోంది. ఇంచు మించుగా వరల్డ్ కప్ లాంటిదన్న మాట ఈ టోర్నమెంట్. ఆ రేంజ్ లో చేస్తున్నారు కూడా. అయితే ఈ టోర్నమెంట్ లో ఇవాళ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఉంది. ఇండియాకు యువరాజ్ సింగ్ కెప్టెన్ అయితే..శిఖర్ ధవన్, అంబటి రాయుడు, సురేశ్ రైనా,యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్ ఇలా ఆల్మోస్ట్ అంతా మనకు తెలిసిన ఇష్టమైన ప్లేయర్లే. బట్ వీళ్లే ఇప్పుడు WCL నిర్వాహకులకు షాక్ ఇచ్చారు. అదేంటంటే పాకిస్తాన్ తో మ్యాచ్ మేం ఆడట్లేదు అని.ఇప్పటి వరకైతే శిఖర్ ధవన్, హర్భజన్ సింగ్, పఠాన్ బ్రదర్స్ పాకిస్తాన్ తో మ్యాచ్ కి మేం అందుబాటులో ఉండమని సమాచారం ఇచ్చారట. ధవన్ అయితే ఈ లీగ్ స్టార్ట్ కాకముందే మే 11న పాకిస్తాన్ మ్యాచ్ ఆడనని తన నిర్ణయం చెప్పానని మెయిల్ స్క్రీన్ షాట్ కూడా సోషల్ మీడియాలో పెట్టాడు. పహల్గాం దాడి కి నిరసనగా పాక్ తో మ్యాచ్ లు ఇక ఆడకూడదని తన నిర్ణయం తీసుకున్నానని..తనకు తన దేశం కంటే ఏదీ ఎక్కువ కాదని ధవన్ చెబుతుంటే..భజ్జీ, పఠాన్ బ్రదర్స్ ముందే చెప్పారో లేదో తెలియదు. కీలక ఆటగాళ్లు నలుగురు ఆడట్లేదని చెప్పటంతో మరి ఈ మ్యాచ్ అసలు ఇవాళ జరుగుతుందో లేదో  తెలియదు. జరగకపోతే మాత్రం నిర్వాహకులకు పెద్ద దెబ్బ అని చెప్పాలి. ఎందుకంటే చాలా మంది ఈ మ్యాచ్ కోసమే టిక్కెట్లు కొనుక్కున్నారు. ఈ లీగ్ మీద బీసీసీఐ అజమాయిషీ ఉండదు. ఇదో ప్రైవేట్ టోర్నమెంట్ కాబట్టి ప్లేయర్ల ఇష్టంపైనే ఆధారపడి ఉంటుంది. సో చూడాలి మనోళ్లు ఇచ్చిన ఈ షాక్ కి మ్యాచ్ జరుగుతుందో లేదా రద్దవుతుందో.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola