Rishabh Pant WTC Runs Record | అదిరిపోయే రికార్డు దిశగా పరుగులు పెడుతున్న పంత్ | ABP Desam

 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ శకం మొదలైన తర్వాత టీమిండియాలోని రెగ్యులర్ బ్యాటర్లంతా దాదాపు 30 టెస్టులకు పైగా ఆడేశారు. సరే కనీసం 30 టెస్టులు ముగిసిన తర్వాత భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన టెస్టు ఆటగాడు ఎవర్రా అని చూస్తే ఇదిగో ఈ షాకింగ్ స్టాటిస్టిక్స్ కనిపించాయి. టాప్ 4 అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో టెస్టు జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. 69 ఇన్నింగ్స్ ల్లో హిట్ మ్యాన్ 2716పరుగులు చేశాడు. ఆ తర్వాత 66 ఇన్నింగ్స్ లో 2677 పరుగులు చేసిన రిషభ్ పంత్ ఉన్నాడు. ఇది నిజంగా షాకింగ్ అసలు. రెండేళ్ల పాటు క్రికెట్ కు దూరమైన రిషభ్ పంత్ చావు నోట్లో తల పెట్టి తిరిగొచ్చి ఇదిగో టెస్టుల్లో ఇలా రెచ్చిపోయాడన్నమాట. తిరిగి జట్టులోకి వచ్చిన తర్వాత భారత్ ఆడిన ఒక్క టెస్టు కూడా మిస్ కాని రిషభ్ పంత్...కింగ్ విరాట్ కొహ్లీ కంటే ఎక్కువ పరుగులు చేయటం గమనార్హం. కొహ్లీ అందరికంటే ఎక్కువగా 79 ఇన్నింగ్సుల్లో బ్యాటింగ్ చేసినా పంత్ కంటే తక్కువగా 2617పరుగులు చేశాడు. నాలుగో స్థానంలో 2500 పరుగులతో గిల్, ఇక ఐదోస్థానంలో 2212 పరుగులతో రాక్ స్టార్ రవీంద్ర జడేజా ఉన్నాడు. సో ఈ ఇంగ్లండ్ సిరీస్ లో మరో 40 పరుగులు చేస్తే...WTC ఎరాలో భారత్ తరపున అత్యుత్తమ టెస్టు బ్యాటర్ గా రిషభ్ పంత్ నిలుస్తాడు. రోహిత్, కొహ్లీ రిటైర్ అయిపోయారు కాబట్టి  పంత్ కు కెప్టెన్ శుభ్ మన్ గిల్ నుంచి మాత్రమే గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. చూడాలి ఈ ఇద్దరిలో ఎవరు పరుగులు మరిగిన హంగ్రీ చీతాలా నిలుస్తారో.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola