
Shami Comeback Series BCCI Video | Ing vs Eng టీ20 సిరీస్ తో షమీ కమ్ బ్యాక్ | ABP Desm
మహమ్మద్ షమీ. 2023 వన్డే వరల్డ్ కప్ చూసిన వాళ్లెవరూ మర్చిపోలేని అనుభూతిని అందించాడు. ఆ వరల్డ్ కప్ మనం ఫైనల్లో ఓడిపోయాం అనే కానీ షమీ మాత్రం ప్రత్యర్థులను గడగడ వణికించాడు. అలాంటి షమీ గాయం కారణంగా రెండేళ్ల పాటు ఆటు దూరం అయ్యాడు. ఈరోజు ఇంగ్లండ్ తో ప్రారంభం కానున్న టీ20 సిరీస్ తో కమ్ బ్యాక్ ఇస్తున్న షమీ కోసం బీసీసీఐ ట్రిబ్యూట్ వీడియోస్ రిలీజ్ చేసింది. ఈ రెండేళ్ల గాయం నుంచి కోలుకోవటానికి షమీ ఎలా ఫైట్ చేశాడు. తనకు ఎదురొచ్చిన అడ్డుగాలిని తోసుకుంటూ ఓ గాలిపటంలా ఎలా ఎగిరాడు ఎదిగాడు అనే అర్థం అయ్యేలా ఓ స్పెషల్ వీడియోను చేయించింది బీసీసీఐ. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ, విజయ్ హజారే ట్రోఫీల్లో ప్రూవ్ చేసుకుని ఛాంపియన్స్ ట్రోఫీకి సెలెక్ట్ అయిన షమీ..ఈరోజు నుంచి ప్రారంభం కానున్న టీ2౦ సిరీస్ తో ప్రూవ్ చేసుకుని తను పూర్తిగా సెలెక్షన్ కి అర్హుడని ప్రూవ్ చేసుకుంటాడని ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. షమీ కూడా ప్రాక్టీస్ సెషన్స్ లో అదరగొడుతూ కనిపించాడు.