![ABP News ABP News](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/22/c2c0a55fa0fb5a849bb44d2fd2ff9af31737561350468310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=200)
Bazball In T20 | ఇంగ్లండ్ పరిమిత ఓవర్లకూ కోచ్ గా మెక్ కల్లమ్ | Ind vs Eng | ABP Desam
మీకు బాజ్ బాల్ తెలుసుగా. టెస్టు క్రికెట్ కు ఓ రకంగా ప్రాణం పోసిన ప్రక్రియ ఇది. ఫలితం గురించి ఆలోచించకుండా విజయం సాధించాలనే ఏకైక లక్ష్యంతో దూకుడైన ఆటతీరు ప్రదర్శించటమే బాజ్ బాల్. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ మెక్ కల్లమ్ ముద్దు పైన బాజ్ పేరు మీదుగా ఈ బాజ్ బాల్ అనే పదం పుట్టింది. ఇంగ్లండ్ టెస్ట్ టీమ్ కు కోచ్ అయిన తర్వాత మెక్ కల్లమ్ ఇంగ్లీష్ జట్టు అతీగతీ మార్చేశాడు. బెన్ స్టోక్స్ ను కెప్టెన్ గా పెట్టుకుని ప్రపంచ టెస్ట్ క్రికెట్ కు పునరుజ్జీవం తెచ్చాడు. ఇక మిగిలినదంతా గతం. ఇప్పుడు ఆ సునామీ టీ20లకు షిఫ్ట్ అవుతోంది. టెస్టులనే ఫలితం తేలేలా టీ20 స్పీడ్ తో ఆడమన్న మెక్ కల్లమ్ ఈ రోజు నుంచి పరిమిత ఓవర్లకు ఇంగ్లండ్ కోచ్ గా వ్యవహరించనున్నాడు. కాబట్టి ఈరోజు రాత్రి ఈడెన్ గార్డెన్స్ లో ప్రారంభమయ్యే ఐదు టీ20 మ్యాచుల సిరీస్ టీమిండియాకు ఓ పెద్ద పరీక్షే. జోస్ బట్లర్ కెప్టెన్ గా, హ్యారీ బ్రూక్ వైస్ కెప్టెన్ గా సరికొత్త స్ట్రాటజీలో దిగుతున్న ఇంగ్లండ్ టీమ్ సొంతగడ్డపై బలమైన, విశ్వవిజేతలుగా ఉన్న టీమిండియాను ఎలా అడ్డుకోగలదో చూడాలి.