Saqlain Mushtaq on Ind vs Pak Match Pitch | మ్యాచ్ ఆడకముందే ఏడుపులు మొదలు | ABP Desam

 ఇన్ని రోజులు మాతో మ్యాచ్ ఆడాలంటే ప్రపంచమే దిగిరావాలంటూ బిల్డప్పులు కొట్టిన పాకిస్తాన్ జట్టు...ఇప్పుడు తన మాజీలను నోటికి పనిచెప్పమని చెప్పినట్లు ఉంది. రోజుకో రిటైర్డ్ ప్లేయర్ చిత్రవిచిత్రమైన స్టేట్మెంట్లతో పిచ్చెక్కిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈనెల 15న పాకిస్తాన్ తో కొలంబోలో భారత్ ఆడాల్సి ఉంది. ఇన్ని రోజులు బాయ్ కాట్ చేస్తామని చెప్పిన పాకిస్తాన్ ఐసీసీ ముందు కొన్ని షరతులు వాటిలో సగానికి సగం సాధించుకుంది. మనోళ్లు షేక్ హ్యాండ్ ఇస్తారో లేదో పక్కనపెడితే ఈ మాజీ ఆటగాళ్లు మ్యాచ్ జరగకముందే అలిగేషన్స్ మొదలుపెట్టారు. పాకిస్తాన్ మాజీ ఆటగాడు, మాజీ కోచ్ సక్లెయిన్ ముస్తాక్...ఏకంగా ఓ విచిత్రమైన వాదనను తెరమీదకు తీసుకువచ్చాడు. అదేంటంటే కొలంబోలో ఏ పిచ్ పై ఆడాలో భారత్ డిసైడ్ చేస్తుందని చెప్పాడు ముస్తాక్. ఒకవేళ పాకిస్తాన్ తో మ్యాచ్ కి ఇదే పిచ్ అని ముందే క్యూరేటర్ చూపించినా ఇప్పుడున్న టెక్నాలజీని యూజ్ చేసి రెండు రోజుల్లో పిచ్ ను భారత్ కి అనుకూలంగా మార్చేసుకుంటారని...ఆ స్థాయిలో ఐసీసీ అధికారులను, వరల్డ్ కప్ టోర్నీ నిర్వాహకులను కూడా బీసీసీఐ మ్యానిప్యులేట్ చేయగలదని ముస్తాక్ అడ్డదిడ్డంగా ఏదో మాట్లాడేశాడు. ఐసీసీకి ప్రధాన ఇన్ కమ్ సోర్స్ బీసీసీఐ కాబట్టి తాము చెప్పింది జరగాలన్నట్లు బీసీసీఐ వ్యవహరిస్తుందని...ఐసీసీ ఛైర్మన్ జైషా బీసీసీఐకి అనుకూలంగా ఉంటారన్నట్లు ఆరోపణలు చేశాడు ముస్తాక్. ఇప్పుడు రేపొద్దున పాకిస్తాన్ మ్యాచ్ ఓడిపోయినా పిచ్ మార్చేసుకున్నారు కాబట్టి ఓడిపోయింది అని చెప్పుకోవటానికి ముందే పిచ్ రెడీ చేస్తున్నామో పాకిస్తాన్ మాజీలు. పరిస్థితి చూస్తే అలానే కనిపిస్తుంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola