Sanju Samson Playing Against Namibia | నమీబియాతో మ్యాచ్ లో బరిలోకి దిగనున్న సంజూ | ABP Desam

 అద్భుతమైన ఫామ్ చూపించి టీ20 వరల్డ్ కప్ కు ఎంపికైన సంజూ శాంసన్ అదృష్టం పదిహేను రోజుల్లో తారుమారైపోయింది. టీ20 వరల్డ్ కప్ ముందు జరిగిన న్యూజిలాండ్ టీ20 సిరీస్ లో ఘోరంగా ఫెయిలైన సంజూ తన స్థానాన్ని అదే స్థానంలో అద్భుతమైన ఫామ్ చూపించిన ఇషాన్ కిషన్ కు కోల్పోయాడు. యూఎస్ఏ తో జరిగిన మ్యాచ్ లో అభిషేక్ తో కలిసి ఇషాన్ కిషన్ ఓపెనింగ్ కి దిగగా...ఇద్దరూ ఫెయిలయ్యారు. అయితే కడుపునొప్పి, ఇన్ ఫెక్షన్ కారణంగా అభిషేక్ శర్మ మ్యాచ్ తర్వాత ఆసుపత్రి పాలయ్యాడు. చికిత్స అనంతరం అభిషేక్ డిశ్చార్చ్ అయినా నమీబియాతో మ్యాచ్ కి అభిషేక్ కు రెస్ట్ ఇచ్చే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని తిలక్ వర్మ నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేశారు. మరీ తప్పనిసరి అనుకుంటే తప్ప అభిషేక్ మ్యాచ్ ఆడడు కాబట్టి తన స్థానంలో సీనియర్ బ్యాటర్ సంజూ శాంసన్ కు మళ్లీ ఛాన్స్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. న్యూజిలాండ్ పై ఐదు మ్యాచుల్లో కలిపి 50 పరుగులు మాత్రమే చేసినా సంజూ...ఇవాళ నమీబియాపై మ్యాచ్ లో భారీ స్కోరు కొడితే తప్ప అతనిపై టీమ్ మేనేజ్మెంట్ నమ్మకం చూపించే అవకాశం ఇకపైన ఉండదు. ఆల్రెడీ టీమ్ లో స్థానాల కోసం ఉన్న భారీ పోటీని తప్పించుకోవాలంటే ఇవాళ సంజూ నమీబియాపై ఇషాన్ కిషన్ తో కలిసి విరుచుకుపడాల్సిందే. చూడాలి మరి చెట్టా తనకు దక్కబోతున్న లాస్ట్ ఛాన్స్ ను ఏం చేస్తాడో

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola