Sachin Tendulkar BCCI Next President | బీసీసీఐ కొత్త ప్రెసిడెంట్‌గా సచిన్ ఎన్నికయ్యే అవకాశం | ABP Desam

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నెక్ట్స్ అధ్యక్షుడు కాబోతున్నాడంటూ రెండు, మూడు రోజుల నుంచి విపరీతంగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ పదవీకాలం త్వరలో కంప్లీట్ కాబోతుండటంతో.. కొత్త అధ్యక్షుడి కోసం బీసీసీఐ ఎన్నిక నిర్వహించబోతోందని, ఆ ఎన్నికలోనే సచిన్ టెండూల్కర్‌ని ప్రెసిడెంట్ చేయబోతున్నారని ఊదరగొట్టాయి. అంతేకాదు.. బోర్డు సభ్యులు కూడా సచిన్‌ టెండూల్కర్ ప్రెసిడెంట్ కావడాన్ని సపోర్ట్ చేస్తున్నారంటూ కూడా వార్తలు వినిపించాయి. కానీ కానీ ఈ వార్తలన్నీ ఫేక్ వార్తలంటూ కొట్టిపారేసింది సచిన్ టెండూల్కర్ ఆఫీస్. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, బీసీసీఐ‌లో ఏ పదవి చేపట్టేందుకు సచిన్ ఇంట్రస్ట్ చూపించడం లేదని, సచిన్ టెండూల్కర్‌కు చెందిన ఎస్‌ఆర్‌టీ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ గురువారం ఓ ప్రకటనను విడుదల చేసింది. ఇదిలా ఉంటే.. సౌరవ్ గంగూలీ అనంతరం 2022లో బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రోజర్ బిన్నీ మూడేళ్ల పదవికాలం త్వరలో ముగియనుండటంతో.. ప్రస్తుతం బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్‌ రాజీవ్ శుక్లా అధ్యక్షతన సెప్టెంబర్ 28న బీసీసీఐ కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోనుంది. బీసీసీఐ ప్రెసిడెంట్‌తో పాటు వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ పదవులకు కొత్తగా ఎన్నిక జరనుంది. ఏది ఏమైనా.. సచిన్ బీసీసీఐ ప్రెసిడెంట్ అవుతున్నారంటే మాత్రం చాలా మంది ఆయన ఫ్యాన్స్ తెగ ఖుషీ అయిపోయారు. మరి మీరు కూడా అందులో ఉన్నారా..?

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola