Asia Cup 2025 । ఆసియా కప్ నుంచి హాంగ్ కాంగ్ ఔట్ | ABP Desam

ఆసియా కప్ 2025 టోర్నీ నుంచి హాంగ్ కాంగ్ ఔట్ అయిపోయింది. గురువారం బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్‌లో పసలేని బౌలింగ్ తో చిత్తుగా ఓడిపోయింది. మరో వైపు బంగ్లాదేశ్ కూడా బౌలింగ్ లో కొద్దిగా ఫెయిల్ అయినా బ్యాటింగ్ లో ఇరగదీసి 8 వికెట్ల తేడాతో విజయం దక్కించుకుంది. కెప్టెన్ లిటన్ దాస్(39 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్స్‌తో 59 పరుగులు చేసి.. హాఫ్ సెంచరీతో బంగ్లాదేశ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన హాంగ్ కాంగ్.. కెప్టెన్ యసిమ్ ముర్తాజా(28), ఇంకో ఓపెనర్ జీషన్ అలీ(30), నిజకత్ ఖాన్(42) రాణించడంతో 20 ఓవర్లలో 7 వికెట్లకు 143 పరుగుల fighting total  చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లలో టస్కిన్ అహ్మద్, తంజీమ్ హసన్ షకీబ్, రిషద్ హొస్సేన్ రెండేసి వికెట్లు తీసుకున్నారు.
అయితే చేజింగ్ లో బంగ్లాదేశ్ ఓపెనర్లు పర్వేజ్ హోస్సేన్(19), తంజిద్ హసన్(14) త్వరగానే ఔటైనా.. కెప్టెన్ లిటన్ దాస్ హాఫ్ సెంచరీ కి తోడుగా టౌహిడ్ హృదయ్ 35 రన్స్ తో నాటౌట్ గా నిలిచి మ్యాచ్ గెలిపించాడు. హాంగ్ కాంగ్ బౌలర్లలో అయుష్ శుక్లా, అతీక్ ఇక్బాల్ చెరో వికెట్ తీసారు. ఏది ఏమైనా హాంగ్ కాంగ్.. బంగ్లాదేశ్ కి బ్యాటింగ్ లో మాత్రం tough fight ఇచ్చిందని మాత్రం చెప్పొచ్చు. అయితే ఈ ఓటమితో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిన హాంగ్ కాంగ్.. సూపర్-4 రేసు నుంచి తప్పుకుంది. ఆ జట్టు శ్రీలంకతో ఆఖరి మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప హాంగ్ కాంగ్ ముందుకెళ్లే ఛాన్స్ లేదు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola