Ruturaj Gaikwad Dropped From Team India Squad | ధోని మీద కోపం గంభీర్ రుత్ రాజ్ పై చూపించారా..? | ABP

Ruturaj Gaikwad Dropped From Team India Squad | క్రికెట్ లో ఏం జరిగినా దానికి ధోనితో లింక్ పెట్టి తలా ఫర్ ఏ రిజన్ అంటూ CSK ఫ్యాన్స్ చెబుతుంటారు. ఇప్పుడు ఇండియా టీమ్ నుంచి రుత్ రాజ్ గైక్వాడ్ ను తప్పించడం వెనుక కూడా కారణం తలా ఫర్ ఏ రిజన్ అంటున్నారు చాలా మంది. ఎందుకంటే..? శ్రీలంకతో టీ20,వన్డేల సిరీస్ కోసం నిన్న టీం ఇండియా జట్లను ప్రకటించారు. అందులో రుత్ రైజ్ గైక్వాడ్ పేరు లేదు. రుత్ రాజ్ ఈ మధ్య కాలంలో సరిగ్గా ఫర్మామెన్స్ చేయలేదా అందుకే తీసేశారేమోఅనుకుంటే పొరపాటే. ఎందుకంటే... జింబాబ్వేతో సిరీస్ లో మూడు ఇన్నింగ్సుల్లో సుమారు 120 పరుగులు చేశాడు. రుత రాజ్ గైక్వాడ్ అభిషేక్ శర్మలా ఓపెనింగ్ లోనే ఆడే రకం కాదు.. ఓపెనింగ్, వన్ డౌన్, సెకండ్ డౌన్ ఇలా.. ఏ ప్లేస్ లో ఐన ఆడగలడు. ఐనప్పటికీ రుత్ రాజ్ ను తీసేశారు. కానీ, జింబాబ్వే సిరీస్ తో ఏ మాత్రం సరిగ్గా రాణించని రియాన్ పరాగ్ మాత్రం ఎంపిక చేశారు. దీంతో.. ఇదెక్కడి రాజకీయం అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మరోవైపు..రుత్ రాజ్ గైక్వాడ్ కు టీంలో స్థానం కోల్పోవడానికి ధోనిని కారణంగా చూపిస్తున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే..గౌతమ్ గంభీర్ కు ధోని అంటే పడదు. చాలా సందర్భాల్లో ఆన్ గ్రౌండ్ లోనూ...ఆఫ్ గ్రౌండ్ లోనూ గంభీర్ తన కోపాన్ని చూపించేవారు. సో...ఇప్పుడు టీమ్ సెలక్షన్ గంభీర్ చేతిలో ఉంది. రుత్ రాజ్ గైక్వాడ్ ఏమో ధోనికి అత్యంత ఇష్టమైన ప్లేయర్ ,CSK కెప్టెన్ కూడా. సో.. అలాంటి వాడిని ఎంకరేజ్ చేయడం కంటే క్రాంటాక్ట్ లో లేని KKR కెప్టెన్ శ్రేయస్అయ్యర్ ను తీసుకోవడానికే ఇష్టపడతాడు కదా.. జరిగింది కూడా అదే. అందుకే.. తలా ఫర్ ఏ రిజన్ తో రుత్ రాజ్ టీం ఇండియా జట్టులో నుంచి అవుట్ అయ్యాడనే ప్రచారం ప్రస్తుతం ఎక్కువగా జరుగుతోంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola