Abhishek Sharma Dropped From India's T20I Squad | టీ20 అటామ్ బాంబ్ అభిషేక్ శర్మకు నో ప్లేస్.. ఎందుకిలా..? | ABP Desam
Abhishek Sharma Dropped From India's T20I Squad |
శుభ్ మన్ గిల్ ను సూపర్ స్టార్ గా చేసేందుకు.. రైజింగ్ స్టార్ అభిషేక్ శర్మను తొక్కేస్తున్నారా..? టీ20ల్లో స్ట్రైక్ రేట్ కు సరికొత్త అర్థం చెబుతున్న అభిషేక్ కంటే..రెగ్యూలర్ క్రికెట్ ఆడుతున్న గిల్ దేనిలో గొప్ప...! అని నెటిజన్లు అంటున్నారు. శ్రీలంకతో సిరీస్ కు సెలెక్టర్లు ప్రకటించిన టీం ఇండియా జట్టును చూసిన తరువాత నెటిజన్లు ఇలాగే రియాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే.. టీ20 జట్టుల్లో ఓపెనర్లుగా గిల్, యశస్వీ జైస్వాల్ ను ప్రకటించారు. ఇటీవల జింబాబ్వే తో జరిగిన టీ20 సిరీస్ లో గిల్ అద్భుతంగా ఆడింది ఏమి లేదు. కానీ, అరంగ్రేట్రం చేసిన అభిషేక్ శర్మ 47 బాల్స్ లోనే సెంచరీతో రఫ్పాడించారు. ఆడిన ప్రతి మ్యాచులో 200 ప్లస్ స్ట్రైక్ రేట్ తో చెలేరగాడు. అంతేందుకు ఐపీఎల్ లో అంతా చూశాం కదా మనోడి విధ్వంసం. 200కుపైగా స్ట్రైక్ రేట్ తో , 42 సి క్సులతో..484 పరుగులతో షేక్ ఆడించాడు. ఈ పరుగులు కంటే అతడు ఆడిన తీరు.. మొత్తం ఇన్నింగ్స్ కే ఊపు తెచ్చే విధానం అందరిని ఆకట్టుకుంది. రేపటి సూపర్ స్టార్ అనే ముద్ర కూడా వేసుకున్నాడు. వరల్డ్ కప్ లోనే చోటు దక్కుతుందని అంతా భావించారు. కానీ, దక్కలేదు. సరే జింబాబ్వే తో సిరీస్ కు ఎంపిక చేశారు అనుకుంటే.. మొదటి 2 మ్యాచులు ఓపెనర్ గా ఆడించారు. 2వ మ్యాచులో సెంచరీ కూడా కొట్టాడు. కానీ 3 వ మ్యాచ్ నుంచి యశస్వీ జైస్వాల్, గిల్ అందుబాటులోకి వచ్చారని... ఓపెనర్ గా శర్మను తప్పించారు. అక్కడే అన్యాయం జరిగిందని ఫ్యాన్స్ ఫీలవుతుంటే ఇప్పుడు ఏకంగా టీ20 జట్టులో పేరు లేకపోవడంతో ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. గిల్ మంచి ఆటగాడే వైస్ కెప్టెన్సీ ఇవ్వడం కూడా కరెక్ట్ గానీ, అతడు వన్డేలకు సూట్ అవుతాడు. టీ20 అటామ్ బాంబు అభిషేక్ శర్మను కాదని....టీ20లకు గిల్ ను ఎంపిక చేయడంపై ఆగ్రహంగా ఉన్నారు.