RSA vs ENG Super 8 Match Highlights | ఇంగ్లండ్ చేతిలో లడ్డూ లాంటి మ్యాచ్ లాగేసుకున్న సౌతాఫ్రికా |ABP

Continues below advertisement

 18 బాల్స్ లో 25పరుగులు చేయాలి. చేతిలో 6వికెట్లు ఉన్నాయి. అప్పటి వరకూ లివింగ్ స్టోన్, హ్యారీ బ్రూక్ సౌతాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. ఆ ఏముంది వరల్డ్ కప్పుల్లో సౌతాఫ్రికా ఇలా క్రూషియల్ స్టేజ్ కి రావటం...చోక్ అయిపోయి ఇంటికి వెళ్లిపోవటం కామనే కదా ఈరోజు కూడా అలాగే ఇంగ్లండ్ చేతిలో ఓడిపోతుందిలే అనుకున్నారు. కానీ సౌతాఫ్రికా అద్భుతమే చేసింది. ఆల్మోస్ట్ ఇంగ్లండ్ చేతుల్లో ఉన్న మ్యాచ్ ను ఆఖరి మూడు ఓవర్లలో లాగేసుకుంది. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ఇంగ్లండ్ ను సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ ఓ ఆట ఆడుకున్నాడు. మరో ఓపెనర్ హెండ్రిక్స్ నుంచి అస్సలు సహకారం లేకున్నా వన్ మేన్ షో చేశాడు డికాక్. ఒక్కడే  38 బంతుల్లో 4ఫోర్లు 4సిక్సర్లతో 65పరుగులు చేశాడు. మిడిల్ ఆర్డర్ లో డేవిడ్ మిల్లర్ కూడా బ్యాట్ కి పనిచెప్పాడు. 28 బంతుల్లో కిల్లర్ మిల్లర్ 43పరుగులు చేయటంతో సౌతాఫ్రికా ఇంగ్లండ్ కు 164పరుగుల లక్ష్యాన్ని ఇవ్వగలిగింది. ఇంగ్లండ్ బ్యాటింగ్ ఉన్న డెప్త్ కి ఇది ఛేజ్ చేయదగిన స్కోరే. పైగా ఇంగ్లండ్ టాప్ ఆర్డర్ విధానం చూస్తే మ్యాచ్ సౌతాఫ్రికాదేమో అనిపించింది. సాల్ట్, బట్లర్ తో పాటు మొయిన్ అలీ, బెయిర్ స్టో కూడా ఫెయిల్ అయ్యారు. అయితే హ్యారీ బ్రూక్ తో కలిసి లివింగ్ స్టోన్ విధ్వంసమే చేశాడు. బ్రూక్ 53పరుగులతో, లివింగ్ స్టోన్ 33పరుగులతో మ్యాచ్ ను ఇంగ్లండ్ వైపు తిప్పేశారు. లాస్ట్ 18 బాల్స్ లో 25పరుగులు చేస్తే ఇక చాలన్న టైమ్ లో సౌతాఫ్రికాను మళ్లీ ట్రాక్ లోకి తీసుకువచ్చాడు రబాడా. లివింగ్ స్టోన్ వికెట్ రబాడా తీస్తే..హ్యారీ బ్రూక్ ను నోకియా అవుట్ చేశాడు. ఇక అంతే తమ చేతుల్లో ఉన్న మ్యాచ్ సౌతాఫ్రికాను తన్నుకెళ్లిపోయింది. ఈ విజయంతో సౌతాఫ్రికా ఆల్మోస్ట్ సెమీస్ కి వెళ్లిపోయినట్లే. రన్ రేట్ భారీ గా ఉండటంతో వెస్టిండీస్ మీద ఓడిపోయినా పర్లేదు..సౌతాఫ్రికా సెమీస్ కి వెళ్లిపోయే అవకాశాలే ఎక్కువున్నాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram