Ind vs Ban Match Preview | T20 World Cup Super 8 లో నేడు భారత్ vs బంగ్లాదేశ్ | ABP Desam
లీగ్ దశలో వరుస విజయాలతో టీ20 వరల్డ్ కప్ లో సూపర్ 8కి దూసుకొచ్చిన భారత్ ఇప్పుడు సెమీస్ పై కన్నేసింది. మొన్నటి మ్యాచ్ లో ఆఫ్గాన్ గండాన్ని సక్సెస్ ఫుల్ గా దాటేసిన మనోళ్లు..ఇప్పుడు ఈ బంగ్లా ఆటంకాన్ని దాటేస్తే ఆల్మోస్ట్ సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ అయిపోయినట్లే. మూడో మ్యాచ్ ఆస్ట్రేలియా మీద ఏదన్నా తేడా కొట్టినా చేసినా ఆఫ్గాన్, బంగ్లాలపై గెలవటం, నెట్ రన్ రేట్ మంచిగా ఉండటం అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఈ రోజు బంగ్లా మీద కసిగా ఆడాలి టీమిండియా. ప్రత్యేకించి మన బలహీనతల్లా కొహ్లీ, రోహిత్ శర్మ ఫామ్ లో లేకపోవటమే. ఓపెనర్లే అలా డల్ గా ఆడుతుంటే ఆ ప్రభావం మిగతా టీమ్ మీద పడుతోంది. అదృష్టం కొద్దీ సూర్యకుమార్ యాదవ్, పంత్ చివర్లో హార్దిక్ పాండ్యా ఆడుతున్నారు కాబట్టి సరిపోతుంది కానీ లేదంటే టీమిండియా ఈ పాటికే షాక్ తగిలేది. బౌలింగ్ అయితే ఈ ప్రపంచకప్ లో మన ప్రధాన బలం. ప్రత్యేకించి జస్ ప్రీత్ బుమ్రా ను చూసి ప్రత్యర్థులు వణికిపోతున్నారు. జడ్డూ, అక్షర్ ఆల్ రౌండ్ షోలతో అదరగొడుతున్నారు. కుల్దీప్, అర్ష్ దీప్ పర్వాలేదనిపిస్తున్నారు. కానీ శివమ్ దూబే బదులు సంజూ శాంసన్ ను మిడిల్ ఆర్డర్ లో ఆడించటమే లేదా కొహ్లీని వన్ డౌన్ కి పంపించి యశస్వి జైశ్వాల్ ను ఓపెనర్ గా తీసుకోవటమే చేయాలనే డిమాండ్ ఫ్యాన్స్ నుంచి వినిపిస్తోంది. మరో వైపు బంగ్లా టీమ్ చూడటానికి స్ట్రాంగ్ గా కనిపిస్తున్నా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో తేలిపోయింది. ముస్తాఫిజర్, తస్కిన్, తంజిద్ అహ్మద్ పేస్ అటాక్ ను మనోళ్లు కాచుకుంటే చాలు. లిటన్ దాస్, కెప్టెన్ నజ్ముల్ శాంటో, హృదాయ్, మహ్మదుల్లా ఇలా బంగ్లా చాలా మంది బ్యాటర్ల మీదే ఆశలు పెట్టుకుంటున్నా టీమిండియా అనేప్పటికి వాళ్లు ఆడగలుగుతారో లేదా మన బుమ్రా బ్యాచ్ ముందు గులామ్ అంటారో ఈ రోజు మ్యాచ్ లో చూడాల్సిందే