Rohit Sharma Breaches 10 Thousand Runs Milestone: మరో మైలురాయి దాటేసిన హిట్ మ్యాన్
ఇండియన్ కెప్టెన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ... శ్రీలంకతో జరుగుతున్న ఏషియా కప్ సూపర్ ఫోర్ మ్యాచ్ లో అరుదైన రికార్డు సృష్టించాడు. మ్యాచ్ మొదలైన దాదాపు అరగంటలోనే చరిత్ర పుస్తకాల్లోకి ఎక్కాడు. ఇండియా తరఫున వన్డేల్లో 10 వేల పరుగుల మైలురాయి అందుకున్న ఆరో బ్యాటర్ గా రికార్డ్ సృష్టించాడు.