Rishabh Pant Rajinikanth Photo Hints CSK | రజినీ స్టైల్లో రిషభ్ ఫోటో..ఫ్యాన్స్ లో మొదలైన చర్చ | ABP

Continues below advertisement

 రిషభ్ పంత్ ఒక్క ఫోటోతో ఐపీఎల్ ఫ్యాన్స్ లో పెద్ద చర్చనే లేపాడు. సూపర్ స్టార్ రజినీకాంత్ స్టైల్ లో ఓ ఫోటో దిగి దానికి పక్కన రజినీకాంత్ ఫోటో కూడా పెట్టి తలైవా అనే ట్యాగ్ తో సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేశాడు. అంతే సీఎస్కే ఫ్యాన్స్ అసెంబుల్ అయిపోయారు అక్కడ. వెల్కమ్ టూ సీఎస్కే అని..సేమ్ సేమ్ బట్ డిఫరెంట్ అని కామెంట్స్ పెట్టేస్తున్నారు. దీనికో రీజన్ ఉంది. సీఎస్కే తమ ఐకాన్ గా సూపర్ స్టార్ రజినీకాంత్ ని భావిస్తూ ఉంటుంది. అయితే ఈ ఎమోషన్ ను మరింత ఎత్తుకు తీసుకువెళ్లింది మహేంద్ర సింగ్ ధోని. ధోని సూపర్ స్టార్ రజినీకాంత్ ని ఇమిటేట్ చేస్తూ గతంలో ఫోటో షూట్స్ కూడా చేసేవారు. వాటిని సీఎస్కే సోషల్ మీడియాలో పోస్ట్ చేసేది. ఆల్మోస్ట్ సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా పాటలన్నీ ధోని కోసం స్టేడియాల్లో ప్లే చేస్తుంటారు. ధోని బ్యాటింగ్ కి వచ్చినప్పుడల్లా ఓ రజినీ పాట మారు మోగిపోతూ ఉంటుంది. రజినీతో అంతటి ఎమోషనల్ కనెక్షన్ ఉన్న సీఎస్కే ఫ్యాన్స్ కి ఇప్పుడు పంత్ చేసిన ఫోటో చూస్తే అతను కూడా సీఎస్కేలోకి వస్తున్నాడని కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి బలం చేకూరినట్లైంది. సీఎస్కేకి ఇప్పటికే రుతురాజ్ గైక్వాడ్ ను కెప్టెన్ గా ప్రకటించినా...త్వరలో మెగా ఆక్షన్ ఉండటంతో కెప్టెన్సీ మార్పులు జరిగే అవకాశమూ లేకపోలేదు. రిటెన్షన్స్ పై ఇప్పటికీ క్లారిటీ రాలేదు కాబట్టి..పంత్ ను ఇన్ సైడ్ ట్రేడ్ చేస్తారా లేదా.. ఎంత ఖర్చు పెట్టైనా సరే పంత్ ను వేలంలో దక్కించుకోవాలని సీఎస్కే ప్రయత్నిస్తోందా..దీనికి సంబంధించి ఇప్పటికే ఓ అంగీకారానికి వచ్చాడు కాబట్టే పంత్ తలైవా ఫోటోను పోస్ట్ చేశాడా లేదా క్యాజువల్ గా పెట్టాడా చూడాలి. మెగా ఆక్షన్ వచ్చే ఏడాది మొదట్లో జరిగే అవకాశం ఉంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram