RCB Franchise Name Change: మరో ఆరు రోజుల్లో ఆర్సీబీ పేరు మారిపోతోంది.. రిషబ్ శెట్టే సాక్ష్యం..!

16 సీజన్లు గడిచాయి. ప్రతి ఏడాది ఐపీఎల్ స్టార్ట్ అయ్యేముందు ఆర్సీబీ ఫ్యాన్స్ అందరితోనూ గట్టిగా చెప్పే మాట ఒక్కటే. ఈ సాలా కప్ నమ్దే. ఈసారి కప్ మాదేనని, కొట్టేస్తామని కాన్ఫిడెంట్ గా చెప్తూ వస్తున్నారు. కానీ ఇప్పటికీ ఆ కల నెరవేరలేదు. ఇంకో 9 రోజుల్లో ఐపీఎల్ స్టార్ట్ అవబోతోంది. ఈసారి జట్టయితే స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. కానీ ఆటతో సంబంధం లేని విషయాలు ఒక్కొక్కటిగా ప్రచారంలోకి వస్తున్నాయి. నిన్న ఏమో ఆర్సీబీ హోంగ్రౌండ్ మారుతుందని రిపోర్ట్స్ వచ్చాయి. ఇప్పుడు తాజాగా వచ్చిన ప్రచారం ఏంటంటే.... ఆర్సీబీ ఫ్రాంచైజీ పేరే మారబోతోందని.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola