PBKS vs GT IPL 2026 Match Highlights | గుజరాత్ టైటాన్స్ పై మూడు వికెట్లతో పంజాబ్ విజయం | ABP Desam

Continues below advertisement

 ఐపీఎల్ లో పంజాబ్ జోరు మళ్లీ మొదలైంది. గతేడాది ఫైనల్లో ఓడి తృటిలో కప్పు కోల్పోయిన అయ్యర్ సేన..మళ్లీ విజయంతో కొత్త సీజన్ ను ఘనంగా ప్రారంభించింది. లో స్కోర్ థ్రిల్లర్ లా సాగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై పంజాబ్ కింగ్స్ మూడు వికెట్ల తేడాతో ఉత్కంఠ భరిత విజయాన్ని అందుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. సూపర్ ఫామ్ బ్యాటర్ సాయి సుదర్శన్ 13పరుగులకే ఔట్ అవ్వగా..గిల్, జోస్ బట్లర్ దొరికిన మంచి ఆరంభాలను పెద్దస్కోర్లుగా మలచలేకపోయారు. గిల్ 39, బట్లర్ 38 పరుగులు చేసి ఔటైపోయారు. గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్, షారూఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా కూడా నామమాత్రపు స్కోర్లు చేయటంతో గుజరాత్ 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు మాత్రమే చేసింది. విజయ్ కుమార్ వైశాఖ్ 4 ఓవర్లలో 34 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు కూల్చడంతో పాటు చాహల్ రెండు వికెట్లు తీయటంతో గుజరాత్ కు పరుగులు రావటం కష్టమైపోయింది. 163పరుగుల ఛేజింగ్ మొదలుపెట్టిన పంజాబ్ కూడా తడబడింది. గత సీజన్ లో మెరిసిన ప్రియాంశ్ ఆర్య 7పరుగులకే ఔట్ కాగా...ప్రభ్ సిమ్రన్ తోడుగా కూపర్ కాన్లే చెలరేగిపోయాడు. ప్రభ్ సిమ్రన్ 37 రన్స్ కొట్టి అవుట్ కాగా...కెప్టెన్ అయ్యర్, నేహాల్ వధీరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టాయినిస్, మార్కో యాన్సన్ అంతా ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. బట్ ఒక్కడై పోరాడిన ఆస్ట్రేలియన్ బ్యాటర్ కూపర్ కాన్లే ఆడిన మొదటి ఐపీఎల్ మ్యాచ్ లోనే 44 బంతుల్లో 72పరుగులు చేసి ఒంటిచేత్తో పంజాబ్ కు సంచలన విజయాన్ని అందించారు. ఫలితంగా మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని 7వికెట్లు కోల్పోయి చేధించింది పంజాబ్.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola