Cooper Connolly 72 vs GT IPL 2026 | పంజాబ్ కు మొదటి మ్యాచ్ లో వరంలా కూపర్ కాన్లే | ABP Desam

Continues below advertisement

 నిన్న గుజరాత్ టైటాన్స్ పై జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కూడా భారీగా తడబడింది. 163పరుగుల ఛేజింగ్ లో ప్రభ్ సిమ్రన్ తప్ప మరో బ్యాటర్ నిలబడిందే లేదు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సహా ఎంతో ఎక్స్ పీరియన్స్ ఉన్న నేహాల్ వధీరా, గత రెండు సీజన్ల స్టార్ బ్యాటర్ శశాంక్ సింగ్ సూపర్ ఆల్ రౌండర్లు మార్కస్ స్టాయినిస్, మార్కో యాన్సన్ ఇలా అంతా వచ్చి పోతుంటే ఓ 22 ఏళ్ల కుర్ర బ్యాటర్ మాత్రం గుజరాత్ విజయానికి అడ్డం పడిపోయాడు. అతని పేరే కూపర్ కాన్లే. అసలు ఆక్షన్ టైమ్ లో పెద్దగా హడావిడే లేకుండా పంజాబ్ కింగ్స్ దక్కించుకున్న ఈ వెస్ట్రన్ ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్..గతేడాది బీబీఎల్ లో పెర్త్ స్కాచర్స్ తరపున దుమ్ము రేపాడు. లీగ్ లో టాప్ స్కోరర్ గానూ నిలిచాడు. అప్పుడే రవిచంద్రన్ అశ్విన్ ఓ ట్వీట్ కూడా చేశాడు. ఎవరూ పట్టించుకోలేదు ఈ టాప్ స్కోరర్ ను పంజాబ్ కింగ్స్ ఆక్షన్ లో సొంతం చేసుకుంది..ఇతని ఎంపిక ఓ మాస్టర్ స్ట్రోక్ కావొచ్చు అని. అశ్విన్ ఊహించినట్లుగానే తన మొట్ట మొదటి ఐపీఎల్ మ్యాచ్ లోనే కూపర్ కాన్లే దుమ్మురేపాడు. బౌలర్లకు సహకరిస్తున్న పిచ్ పై 44 బాల్స్ లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 72పరుగులు చేయటమే కాదు ఆల్మోస్ట్ ఒంటిచేత్తో గుజరాత్ పై పంజాబ్ ను గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కైవసం చేసుకున్నాడు. అయితే ఈ పర్ ఫార్మెన్స్ ను సేమ్ ఆస్ట్రేలియన్ ప్లేయర్ షాన్ మార్ష్ ఇన్నింగ్స్ తో పోలుస్తున్నారు క్రిటిక్స్. 2008 తొలి ఐపీఎల్ సీజన్ లో అప్పుడు యువ బ్యాటర్ గా వచ్చిన షాన్ మార్ష్ తన తొలి ఐపీఎల్ మ్యాచ్ లోనే 84పరుగులు చేసి నాటౌట్ గా నిలవటంతో పాటు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ను గెలిపించాడు. అప్పుడు మార్ష్ కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇప్పుడు కాన్లే కూడా ఫస్ట్ మ్యాచ్ లోనే మ్యాచ్ విన్నింగ్ ఫర్ ఫార్మెన్స్ ఇవ్వటం..ఇద్దరూ ఆస్ట్రేలియన్లే కావటం...ఇద్దరకీ మొదటి ఐపీఎల్ మ్యాచ్ కావటం అన్నీ కో ఇన్సిడెన్స్ కొద్దీ అచ్చం అలానే ఉన్నాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola