Pakistan vs United States Highlights | T 20 World Cup 2024 | చిన్న టీమ్ చేతిలో పాకిస్థాన్ చిత్తు

Continues below advertisement

Pakistan vs United States Highlights | T 20 World Cup 2024 | టీ20 ప్రపంచ కప్ లో ఓ సంచలన విజయం నమోదైంది. బలమైన పాకిస్థాన్ పై పసికూన అమెరికా విజయం సాధించింది. గ్రూప్‌ ఎ లో డల్లాస్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సూపర్‌ ఓవర్‌లో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఛేజింగ్ లో అమెరికా కూడా 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయడంతో మ్యాచ్‌ టై అయింది. ఇగ..మ్యాచ్ సూపర్ ఓవర్ కు వెళ్లిపోయింది. సూపర్ ఓవర్ లో తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా 18 పరుగులు చేసింది. ఇక..19 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన పాకిస్థాన్ కేవలం 13 పరుగులే కొట్టింది. దీంతో.. అమెరికా చారిత్రాత్మకమైన విజయం సాధించినట్లైంది. టీ20 వరల్డ్ కప్ ముందర పాకిస్థాన్ ఆటగాళ్లు ఆర్మీలో కూడా ట్రైనింగ్ తీసుకున్నారు. దీంతో.. అంతలా ట్రైనింగ్ తీసుకున్నది ఇంత చిన్న టీమ్ పై ఓడిపోవడానికా..?అంటూ ఫ్యాన్స్ ట్రోలింగ్ మొదలుపెట్టారు

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram