MS Dhoni about IPL Retirement | రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన తల ధోని | ABP Desam

చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ అంటే మనకు ముందు గుర్తు వచ్చేది ధోని. గత కొన్ని సంవత్సరాలుగా ఇదే ధోని చివరి ఐపీఎల్ సీజన్ అంటూ ప్రతిసారి వార్తలు వస్తాయి. వాటిని కొట్టిపారేస్తూ.. మైదానంలో ధోని సమాధానం చెప్తారు. అయితే ఎప్పటి లాగానే ఐపీఎల్ 2026 ధోనికి ఆఖరి సీజన్ అంటూ మాజీ ప్లేయర్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఈ వార్తలపై స్వయంగా తల స్పందించారు. 

చెపాక్ స్టేడియంలో జరిగిన CSK ఈవెంట్ లో కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ కూడా పాల్గొన్నారు. ధోనీకి తాను పెద్ద ఫ్యాన్ అని చెబుతూ.. రిటైర్మెంట్ గురించి అడిగారు శివకార్తికేయన్. ధోనీ నవ్వుతూ స్పందిస్తూ.. "ఈ వయసులో ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం సవాలుతో కూడుకున్న పనే.. కానీ అభిమానుల కోసం ఏకంగా 60 ఏళ్ల వరకు ఆడతానేమో" అని జోక్ చేశారు. ధోనీ నోటి నుంచి ఆ మాట రాగానే స్టేడియం మొత్తం 'ధోనీ.. ధోనీ..' అంటూ మారుమ్రోగింది. 

44 ఏళ్ల వయసున్న ధోనీ, ఐపీఎల్ 2026 కోసం సిద్ధమవుతున్నారు. ఈసారి సంజూ శాంసన్ వంటి స్టార్ ప్లేయర్లు టీమ్ లోకి రావడంతో వికెట్ కీపింగ్ బాధ్యతలు పంచుకునే అవకాశం ఉంది. ఇంపాక్ట్ ప్లేయర్ గా ధోని బరిలోకి దిగే ఛాన్స్ ఉంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola