Aakash Chopra comments on SRH | SRH బౌలింగ్‌పై ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు | ABP Desam

ఐపీఎల్ 2026 ప్రారంభం కాకముందే ఆరెంజ్ ఆర్మీకి గట్టి షాక్ తగిలింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈసారి ఎలాగైనా టైటిల్ కొట్టాని చూస్తుంది. అయితే SRH బౌలింగ్ పై ఆకాశ్ చోప్రా షాకింగ్ కామెంట్స్ చేశారు. "SRH బ్యాటర్లు 250 పరుగులు చేసినా, ఆ టార్గెట్ ను కాపాడుకుంటారనే నమ్మకం నాకు లేదు" అంటూ షాక్ ఇచ్చాడు. 

ఈ సీజన్ ప్రారంభం కాకముందే కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గాయంతో ఫస్ట్ హాఫ్ లో జరిగే గేమ్స్ కు దూరం అవుతాడు. దాంతో ఇషాన్ కిషన్‌ను తాత్కాలిక కెప్టెన్ గా నియమించారు. స్టార్ పేసర్లు ఎషాన్ మలింగ, జాక్ ఎడ్వర్డ్స్ కూడా గాయాల కారణంగా టోర్నీ నుంచి తప్పుకోవడంతో ఆరెంజ్ ఆర్మీ బౌలింగ్ లైనప్ బలహీనపడింది.

దీనిపై ఆకాశ్ చోప్రా స్పందిస్తూ.. "కమిన్స్, మలింగ లేని బౌలింగ్ విభాగం చాలా దారుణంగా కనిపిస్తోంది. బ్రైడన్ కార్స్ ఉన్నప్పటికీ భారత పిచ్‌లపై అతనికి అనుభవం తక్కువ. హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాద్కత్ మినహా అమిత్ కుమార్, ప్రఫుల్ హింగే వంటి ప్లయెర్స్తో టీమ్ ను నడిపించడం కత్తిమీద సామే. బ్యాటర్లు కష్టపడి భారీ స్కోర్లు చేసినా, బౌలర్లు పరుగులు సమర్పించుకునేలా ఉన్నారు" అని అన్నాడు. బలహీనమైన బౌలింగ్‌తో ఆరెంజ్ ఆర్మీ ఎలా నెట్టుకొస్తుందో చూడాలి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola