Laxman Sivaramakrishnan Commentary BCCI | కామెంటరీకి శివరామకృష్ణన్ గుడ్ బై | ABP Desam

Continues below advertisement

భారత మాజీ లెగ్ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. గత 23 ఏళ్లుగా కామెంటేటర్‌గా సేవలందిస్తున్న ఆయన, అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటిస్తూ తన ఆవేదనను వ్యక్తం చేసారు. తాను నల్లగా ఉండటం వల్లే వివక్షకు గురయ్యానని, అందుకే తనకు మ్యాచ్ ప్రజెంటర్‌గా, టాస్ వేసే సమయంలో అవకాశాలు ఇవ్వలేదని ఆరోపించారు. 

రవిశాస్త్రి కోచ్‌గా ఉన్న సమయంలో కూడా కొత్తగా వచ్చిన వారికి అవకాశాలు ఇచ్చారని, సీనియర్ అయిన తనను మాత్రం పట్టించుకోలేదని ఆయన పేర్కొన్నారు. "రెండేళ్లుగా కామెంట్రీ దూరంగా ఉన్నా. బీసీసీఐ కామెంట్రీ కి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా. ముంబై మాఫియా నన్ను తీవ్రంగా వేధించింది వర్ణవివక్షకు గురయ్యాను. నల్లగా ఉంటే కామెంట్రీ కి పనికి రారా.. రెండేళ్లుగా గోల్ఫ్ మీద దృష్టి పెట్టాను. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నా. కుటుంబానికి సమయం కేటాయించా. ఎదురైనవి చాలు. అందుకే క్రికెట్ ని కామెంట్రిని వదిలేస్తున్నా అంటూ చెప్పుకొచ్చారు. 

1983లో అతి చిన్న వయసులో టెస్ట్ అరంగేట్రం చేసిన రికార్డు సృష్టించిన శివరామకృష్ణన్, 1985 వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించారు. కామెంటరీ కెరీర్ ముగింపు దశలో ఆయన చేసి ఈ ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. బీసీసీఐ దీనిపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola