MS Dhoni Injured in CSK Practice Camp IPL 2026 | ధోనీ మోకాలి గాయం ? | ABP Desam

ఐపీఎల్ 2026 సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ రెడీ అవుతుంది. హోమ్ గ్రౌండ్ చెపాక్‌లో ప్రాక్టీస్ క్యాంప్‌ను ప్రారంభించారు. ధోనీతో పాటు మిగితా టీమ్ మేట్స్ అందరు చాలా కష్టపడుతున్నారు. అయితే, ప్రాక్టీస్ సెషన్ లో ధోనీ మోకాలి నొప్పితో ఇబ్బంది పడుతూ కనిపించడంతో ఫ్యాన్స్ టెన్షన్ లో పడ్డారు. 

ఐపీఎల్ 2023 సీజన్ నుంచే ధోనీ ఎడమ మోకాలి గాయంతో ఇబ్బంది పడుతున్నారు. ఆ సీజన్ ముగిసిన వెంటనే ఆపరేషన్ చేయించుకున్నాడు. సర్జరీ తర్వాత కోలుకుని 2024, 2025 సీజన్లలో ఆడినప్పటికీ, ఆ గాయం పూర్తిగా తగ్గలేదని తెలుస్తుంది. 

దాంతో ఫ్యాన్స్ అందరు సోషల్ మీడియా వేదికగా ధోనీపై కన్సర్న్ చూపిస్తున్నారు. ఫ్యాన్స్ కోసం ధోనీ ఇంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధోనీ ఫిట్‌నెస్‌పై సీఎస్‌కే మేనేజ్‌మెంట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఒకవేళ ధోనీకి రెస్ట్ అవసరం అయితే కీపింగ్, కెప్టెన్సీ బాధ్యతల్లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola