KL Rahul Following MS Dhoni: ఇది ఇలానే కొనసాగి మనకు వరల్డ్ కప్ వచ్చేస్తే ఎంత బాగుంటుందో!
ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ గా ఉన్నప్పుడు, ధోనీ కూల్నెస్ మరియు క్రికెటింగ్ బ్రెయిన్ చూసి అంతా నివ్వెరపోయారు. ఆ రేంజ్ ఇంపాక్ట్ మరి. కానీ అదే సమయంలో క్రికెట్ ప్రపంచంలో చాలా ఎక్కువగా ఓ మాట వినిపించేది. అదృష్టం కూడా ధోనీకి ఎప్పుడూ సహకరిస్తూ ఉంటుందని. ఇంగ్లీష్ లో చెప్పాలంటే లక్కీ చార్మ్ అంటారు. మహీ మ్యాజిక్ అనే పేరు కూడా పెట్టేశారు. ఇప్పుడు అలాంటి అదృష్టమే కేఎల్ రాహుల్ కు కూడా ఉన్నట్టు కనిపిస్తోంది. అది నేను చెప్పట్లేదు. అతను కెప్టెన్సీ చేసిన మ్యాచుల్లో నమోదైన రికార్డులే చెప్తున్నాయి.