KKR vs LSG Highlights | Rinku Singh Batting: దాదాపుగా మరో అద్భుతాన్ని సృష్టించిన రాక్ స్టార్ రింకూ
Continues below advertisement
లక్నో ఆటగాళ్లు, మేనేజ్ మెంట్, ఫ్యాన్స్ అందరికీ.... ఓ రెండు ఓవర్ల పాటు గుండెలు గొంతుల్లోకి వచ్చేసి ఉంటాయి. దానికి కారణం.... రాక్ స్టార్ రింకూ సింగ్. కేకేఆర్ కు , ఇండియాకు దొరికిన భావి ఫినిషర్. దాదాపుగా ఒంటిచేత్తో మ్యాచ్ గెలిపించినంత పని చేశాడు. అయితే ఆఖర్లో ఒక్కడే అయిపోవటంతో 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక కేకేఆర్ కేవలం ఒక్కటంటే ఒకే ఒక్క పరుగుతేడాతో ఓటమి పాలైంది.
Continues below advertisement