Joginder Sharma About Gautam Gambhir | గంభీర్ కెప్టెన్సీ పై జోగిందర్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

Joginder Sharma About Gautam Gambhir |  టీం ఇండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ ఎక్కువ కాలం కొనసాగరని మాజీ క్రికెటర్ జోగిందర్ శర్మ అభిప్రాయపడ్డారు. 2007టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ఓవర్ వేసిన బౌలర్ ఇతడు. ప్రస్తుతం హరియాణలో డీఎస్పీగా పని చేస్తున్నారు. ఇటీవల 12 ఏళ్ల తరువాత ధోనిని కలిశాడు. ఆ తరువాత విడుదలైన ఓ పాడ్ కాస్ట్ లో జోగిందర్ శర్మ గౌతమ్ గంభీర్ పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. శుభాంకర్ మిశ్రా పాడ్ కాస్ట్ లో పాల్గొన్న జోగిందర్ శర్మ.. గంభీర్ అగ్రేసివ్ నేస్ అతడికి ప్రాబ్లమ్ గా మారుతుందన్నాడు. గంభీర్ బాగా ఆలోచిస్తాడు. కానీ ఆ ఆలోచనలు మిగితా టీమ్ ఒప్పుకుంటుందా లేదా అన్నది పట్టించుకోకుండా దూకుడుగా ముందుకెళ్తాడు. దాని వల్ల టీమ్ లో మిగతా ఆటగాళ్లు ఇబ్బంది పడే అవకాశముందన్నారు. క్రికెట్ పట్ల గంభీర్ నిజాయితీగా ఉంటాడు. ముక్కుసూటిగా ఉంటాడు. దాని వల్లే కోపంగా కనిపిస్తాడు కానీ బేసి క్ గా గేమ్ కోసం ఏదైనా చేసే అతికొద్ది మంది క్రికెటర్లలోనే తను ఒకడని జోగిందర్ శర్మ ప్రశంసించారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola