Jasprit Bumrah Bowling vs Eng | T20 World Cup 2026 ఫైనల్ కి భారత్ వెళ్లింది అంటే..బుమ్రా దయ | ABP Desam

Continues below advertisement

 ఇంగ్లండ్ పై 89 పరుగులు చేసి సెమీస్ లో భారత్ విజయానికి కారణమైన సంజూ శాంసన్ కు వరుసగా రెండో మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అయితే ఆ అవార్డు అందుకున్న శాంసన్ చెప్పిన మొదటి మాట. ఈ అవార్డు దక్కిందన్నా..నేను ఇక్కడ నిలబడ్డానన్నా...రీజన్ జస్ ప్రీత్ బుమ్రా అన్నాడు. అవును అంతటి స్థాయి ఉన్న బౌలింగ్ స్పెల్ ను నిన్న బుమ్రా ఆంగ్లేయులకు రుచి చూపించాడు. దెబ్బకు వాళ్ల క్రికెట్ విశ్లేషకులు బుమ్రాను బౌలింగ్ లో బ్రాడ్ మన్ అని పోలుస్తున్నారు. ఎస్ ఈ అలంకారాలకు బుమ్రా కచ్చితంగా అర్హుడు. నిన్న హై స్కోర్ థ్రిల్లర్ గా మారిపోయిన మ్యాచ్ లో బుమ్రా మాత్రమే భారత్ కు కొండంత అండగా నిలిచాడు. 4 ఓవర్ల బౌలింగ్ లో 33 పరుగులు ఇచ్చి కెప్టెన్ హ్యారీ బ్రూక్ వికెట్ మాత్రమే తీశాడు బుమ్రా. హైలెట్స్ చూస్తే అర్థమయ్యేది ఇదే. కానీ మ్యాచ్ చూస్తే బుమ్రా ఇంపాక్ట్ ఏంటో అర్థం అవుతుంది. తన బౌలింగ్ దిగిన మొదటి ఓవర్ మొదటి బంతికే కెప్టెన్ హ్యారీ బ్రూక్ వికెట్ తీసుకున్నాడు బుమ్రా. అక్షర్ పటేల్ పట్టిన అద్భుతమైన క్యాచ్ కు ఇంగ్లీష్ కెప్టెన్ బలయ్యాడు. తను వేసిన మొదటి రెండు ఓవర్లలో 19 పరుగులు ఇచ్చిన బుమ్రా..తను వేసిన సెకండ్ స్పెల్ తో ఇండియాను బతికించాడు. ఓవర్ కి 13-14 పరుగులు చొప్పున కొడితే చాలు ఇంగ్లండ్ మ్యాచ్ సులభంగా గెలిచేయొచ్చన్న సమీకరణాలను బుమ్రా పాతాళంలోకి తొక్కేశాడు. 16వ ఓవర్ బౌలింగ్ చేసి 8పరుగులు మాత్రమే ఇచ్చిన బుమ్రా...మ్యాచ్ కి ఎంతో కీలకమైన 18వ ఓవర్ బౌలింగ్ చేసి ఆరు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ప్రతీ బాల్ కూడా పదునైన యార్కర్. కాలు కొంచెం తీసినా...బ్యాటర్ ఏకాగ్రత ఏ మాత్రం చెదిరినా విసిరే బంతి మృత్యు ఘోషను బ్యాటర్ వినాల్సిందే. సెంచరీ వీరుడు బెత్ హెల్, హిట్టర్ శామ్ కరన్ లను తన పదునైన యార్కర్లతో కట్టి పడేసిన బుమ్రా ఆ రెండు ఓవర్లలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి మ్యాచ్ ను భారత్ వైపు తిప్పేశాడు. ఆఖరి ఓవర్ కి ఇంగ్లండ్ 30 కొట్టాలంటే కెప్టెన్ సూర్య ధైర్యంగా దూబే చేతికి బాల్ ఇవ్వగలిగాడు అంటే ఆ ధైర్యం మనకు పంచింది బుమ్రానే. నిన్నటి మ్యాచ్ లో భారత్ గెలుపునకు, ఇంగ్లండ్ ఓటమికి ఒకడే తేడా..అతనే బుమ్రా. తను భారత్ కి ఆడుతున్నందుకు..యుగానికి ఒక్కడిలా తన అద్భుతమైన బౌలింగ్ తో చిరస్మరణీయ విజయాలు అందిస్తున్నందుకు భారత్ క్రికెట్ నిజంగా లక్కీ అని చెప్పుకోవాలి. నో డౌట్స్ ఇందులో.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola